Trending Video: ఇప్పుడే ఇలా ఉంటే ఇక పెళ్లయ్యాక ఇక పెళ్లయ్యాక దబిడి దిబిడే.. వరుడి పరిస్థితి చూసి జాలేస్తోందంటున్న నెటిజన్లు..
ప్రస్తుత కాలంలో పెళ్లి అనేది.. చాలా వైభవంగా జరిగే అపురూపమైన వేడుక. ఇక పెళ్లిలో నిర్వహించే బరాత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జోష్ అంతా అందులోనే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా,...
ప్రస్తుత కాలంలో పెళ్లి అనేది.. చాలా వైభవంగా జరిగే అపురూపమైన వేడుక. ఇక పెళ్లిలో నిర్వహించే బరాత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జోష్ అంతా అందులోనే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, నవ వధూవరులు కూడా స్టెప్పులేస్తుంటారు. ఇది ఆ వివాహ వేడుకకు మరింత వన్నె తీసుకువస్తుంది. పెళ్లిలో డ్యాన్స్, పాటలు లేకపోతే అది అసంపూర్ణంగా కనిపిస్తుంది. డ్యాన్స్, పాటలతోనే పెళ్లి వాతావరణం ఏర్పడుతుంది. వివాహంలో వధూవరులు నృత్యం చేస్తూ కనిపిస్తున్నారు. కొన్నిసార్లు వధూవరుల వేదికపై అలాంటి డ్యాన్స్ ఎంట్రీని అతిథులు చూస్తూనే ఉంటారు. ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు అందరనీ ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
మగవాళ్లు, ఆడవాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఇప్పుడు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపిస్తున్నారు. రోజూ జిమ్‌కి వెళ్లడం, గంటల తరబడి చెమటలు కక్కడం ఇప్పుడు అలవాటుగా మారింది. ప్రస్తుతం అలాంటిదే వధూవరుల వీడియోలో వైరల్ అవుతోంది. ఇందులో వధూవరులిద్దరూ డ్యాన్స్‌తో పాటు వర్కవుట్స్ చేస్తూ కనిపించారు. వీడియోలో.. బ్యాక్‌గ్రౌండ్‌లో పంజాబీ పాట ప్లే అవుతుండగా లెహంగా ధరించిన వధువు ఫుల్ ఎనర్జీతో రాడ్‌పై పుషప్‌లు చేయడాన్ని చూడవచ్చు. ఇది చూసి వరుడు కూడా వర్కవుట్‌లు చేస్తాడు. వధూవరులు చేసిన ఈ వెరైటీ డ్యాన్స్ ను చూసి అక్కడున్న వారందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు.
View this post on Instagram
ఈ అద్భుతమైన ఫిట్‌నెస్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెడ్డింగ్‌యాన్సర్స్ అనే ఐడితో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 35 వేలకు పైగా వ్యూస్, వందలాది లైక్స్ వచ్చాయి. వీడియోను చూసిన ప్రజలు భిన్నమైన స్పందనలు ఇచ్చారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.