Madhya Pradesh: నన్ను పెళ్లి చేసుకో అన్నందుకు నడిరోడ్డుపై యువతిని చావబాదిన ప్రియుడి ఇంట్లోకి పరిగెత్తిన బుల్డోజర్..
నిందితుడు పంకజ్ త్రిపాఠిపై కిడ్నాప్, దాడి తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు వీడియోను వైరల్ చేసిన యువకుడిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు..
ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడిచేసిన ప్రియుడి ఉదంతం ఇటీవల సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని నడిరోడ్డుపైనే చావబాదాడో ప్రియుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఘటనపై స్పందించిన యూపీ పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. వైరల్ అవుతున్న వీడియోలోని యువకుడిని మౌగంజ్ ప్రాంతంలోని ధేరా గ్రామానికి చెందిన 24 ఏళ్ల పంకజ్ త్రిపాఠిగా గుర్తించారు.
యువతిని చిత్రహింసలకు గురిచేసిన హృదయం లేని ప్రేమికుడిని మీర్జాపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసులో స్టేషన్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేశారు. అంతేకాదు నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు. నిందితుడు పంకజ్ త్రిపాఠిపై కిడ్నాప్, దాడి తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు వీడియోను వైరల్ చేసిన యువకుడిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
रीवा जिले के मऊगंज क्षेत्र में युवती के साथ हुई बर्बरता की घटना में अपराधी पंकज त्रिपाठी को गिरफ्तार कर उसके घर पर बुलडोजर चलाया गया। ड्राइवर पंकज का लाइसेंस भी कैंसल कर दिया गया है।
मध्यप्रदेश की धरती पर महिलाओं पर अत्याचार करने वाला कोई बख्शा नहीं जायेगा। pic.twitter.com/Z4gHr2lWsk
— Office of Shivraj (@OfficeofSSC) December 25, 2022
అయితే, అతడిపై ఫిర్యాదు చేసేందుకు బాధిత యువతి నిరాకరించినట్టుగా తెలిసింది. దాంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టినట్టుగా సమాచారం. అమ్మాయిని హింసించిన నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్‌తో కూల్చివేసినట్టు సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. నిందితుడి ఇల్లు అక్రమ నిర్మాణమని, అందుకే కూల్చేశామని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి