Banana Side Effects: ఈ వ్యక్తులు అరటి పండ్లు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి..
సాధారణంగా అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. శరీరంలో తక్షిణ శక్తిని అందించడమే
సాధారణంగా అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. శరీరంలో తక్షిణ శక్తిని అందించడమే కాకుండా..బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అలాగే గుండెను రక్షిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గించడమే కాకుండా.. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేసి అజీర్ణం సమస్యను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే అరటి పండ్లు కొన్ని సందర్భాల్లో హాని కల్గించే అవకాశం ఉంది. రాత్రిళ్లు అరటి పండును అస్సలు తినకూడదు. అలాగే శ్యాస తీసుకోవడంలో సమస్య ఉన్నవారు.. జలుపు, దగ్గు ఉన్నప్పుడు అరటి పండ్లను తినవద్దు. ఇందులో పొటాషియం, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, నియాసిన్, రిబోప్లావిన్, విటిమిన్ బి 6 వంటి పోషకాలు అనేకం ఉంటాయి.
అరటి పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే చలికాలంలో అరటి పండ్లను తీసుకోవడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే బరువు అదుపు చేయడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. గుండెజబ్బులను తగ్గించడంలోనూ అరటి పండ్లు ఉపయోగపడుతాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు పెరగదు. అరటి పండ్లలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఇది అందరికి చాలా మంచిది ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్, జీర్ణ కోశ సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది. అదే విధంగా జీర్ణాశయానికి మేలు చేసే బ్యాక్టీరియా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇక సైనస్ సమస్య ఉన్నవారు అరటి పండ్లను అస్సలు తినకూడదు. వీరు అరటి పండు తినడం వలన శరీరంలో శ్లేష్మం ఎక్కువగా పేరుకుపోతుంది. వీరు అరటి పండ్లను తినకూడదు. అలాగే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు అరటి పండ్లకు దూరంగా ఉండాలి.
Gali Janardhan Reddy Son: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి కొడుకు.. దర్శకుడు ఎవరంటే..
Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..