కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పదార్థాలు తింటే ప్రాణానికే ప్రమాదం.. అవేంటంటే..

|

Mar 10, 2022 | 6:29 PM

శరీరం సరైన పనితీరు ఉండాలంటే కిడ్నీలు అతిముఖ్యమైనవి. రక్తన్ని శుభ్రం చేయడమే కాకుండా.. శరీరంలోని వ్యర్థాలను తొలగించడం..

కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పదార్థాలు తింటే ప్రాణానికే ప్రమాదం.. అవేంటంటే..
Food
Follow us on

శరీరం సరైన పనితీరు ఉండాలంటే కిడ్నీలు అతిముఖ్యమైనవి. రక్తన్ని శుభ్రం చేయడమే కాకుండా.. శరీరంలోని వ్యర్థాలను తొలగించడం.. హార్మోన్లను తయారు చేయడం.. ఖనిజాలు.. ద్రవాలను సమతుల్యం చేయడం వంటి అనేక పనులను కిడ్నీలు చేస్తాయి. కానీ కిడ్నీ సమస్యలు చాలా ప్రమాదం. మనిషి ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే కిడ్నీలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. మధుమేహం.. అదధిక రక్తపోటు.. మధ్యపానం.. గుండె జబ్బులు.. హైపటైటీస్ సి.. హెచ్ఐవి వంటి మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారకాలు. కిడ్నీ చెడిపోయినప్పుడు.. సరిగ్గా పనిచేయకపోవడానికి కరాణం రక్తంలో వ్యర్థాలు పేరుకుపోవడమే. అయితే మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు కూడా కిడ్నీ పనితీరును దెబ్బతిస్తాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవద్దో తెలుసుకుందామా.

ఆరెంజ్ ఫ్రూట్ జ్యూస్ లో విటమిన్ సి ఉంటుంది. వీటిలో పోటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఒక పెద్ద నారింజలో 333 mg పొటాషియం ఉంటుంది. కప్పు నారింజ రసంలో 473 mg పొటాషియం ఉంటుంది. అందులో ఉన్న పొటాషియం కంటెంట్ దృష్ట్యా కిడ్నీ రోగులు నారింజను తక్కువగా తినాలి. వీటికి బదులుగా ద్రాక్ష, యాపిల్స్, క్రాన్బెర్రీస్ రసం తీసుకోవచ్చు. ఇందులో పోటాషియం కంటెంట్ తక్కువగా ఉంటుంది.

చట్నీలు.. ఊరగాయలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇందులో సోడియం ఎక్కువగా ఉండడం వలన శరీరానికి హాని చేస్తాయి. అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు పచ్చళ్లు.. చట్నీలు అస్సలు తినకూడదు. బంగాళదుంపలో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న బంగాళ దుంపను కట్ చేసి 10 నిమిషాలు ఉడకబెడితో అందులో ఉండే పోటాషియాన్ని 50 శాతం తగ్గించవచ్చు. వీటిని ఉడికించే ముందు కనీసం 4 గంటలు నీటిలో నానబెట్టడం వలన పోటాషియం తగ్గుతుంది.

అరటి పండులో సోడియం తక్కువగా ఉంటుంది. అలాగే.. పోటాషియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్వారు పోటాషియం తక్కువగా తీసుకోవాలి. పైనాపిల్ లో పోటాషియం తక్కువగా ఉంటుంది. అలాగే పాల ఉత్పత్తులు తగ్గించాలి. వీటిలో భాస్వరం, పోటాషియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలు పాడవుతాయి. దీంతో రక్తంలో అధిక మొత్తంలో భాస్వరం ఏర్పడుతుంది. ఇది ఎముకల నుంచి కాల్షియంను తగ్గిస్తుంది. దీంతో ఎముకలు సన్నబడి బలహీనంగా మారతాయి..

ముదురు రంగు సోడాలో కేలరీలు, చక్కెరతో పాటు భాస్వరం ఉంటుంది. భాస్వరం వాటి రుచిని మెరుగుపరచడానికి, వాటి రంగును స్థిరీకరించడానికి, వాటి షెల్ఫ్ జీవితాన్ని పోడగించడానికి ఉపయోగపడుతుంది. ఈ రకమైన ఫాస్పరస్ సహజమైన దానికంటే ఎక్కువ పరిమాణం గ్రహిస్తుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో ఉప్పు పేగులలో పేరుకుపోతుంది.

సూప్ లు, కూరగాయలు .. బీన్స్, వంటి క్యాన్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. వీటిలో సోడియం ఉంటుంది. ఎందుకంటే అవి ప్రిజర్వేటివ్‌లుగా ఉపయోగించబడతాయి. అధిక సోడియం ఉండడం వలన తక్కువగా తీసుకోవాలి. గొధుమ రొట్టేలో ఫైబల్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు గోధుమ రోట్టే తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటాయి. వైట్ బ్రెడ్ లో ఫాస్పరస్.. పోటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటిని తక్కువగా తీసుకోవాలి.

గమనిక: – ఈ కథనం కేవలం నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. సందేహాల కోసం వైద్యులను సంప్రదించాలి.

Also Read: Sitara Gattamaneni: సితారలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. ఏకంగా బుర్జ్ ఖలీఫానే..

Rashmi Gautham: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన రష్మి.. తేలికగా ఆ మాటలు అనేస్తుంటారు అంటూ..

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…

ET Movie Review: నారీలోకానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఈటీ!..