Skin Care Tips: మెడ రంగు నల్లగా మారుతున్నట్లయితే.. తెల్లగా చేసే అద్బుతమైన చిట్కా..

|

Jun 24, 2022 | 6:14 PM

ఫేషియల్, స్క్రబ్బింగ్, మసాజ్ వంటి అనేక రకాలుగా కష్టపడుతుంటారు. కానీ మెడ విషయానికి వస్తే, మనం వాటిని మరిచిపోతాం. మన అజాగ్రత్త వల్ల మెడ చుట్టూ ఉండే చర్మం చాలా నల్లగా మారుతుంది. 

Skin Care Tips: మెడ రంగు నల్లగా మారుతున్నట్లయితే.. తెల్లగా చేసే అద్బుతమైన చిట్కా..
Dark Black Neck Overnight
Follow us on

సాధారణంగా, గ్లోయింగ్ లుక్ పొందడానికి ఫేషియల్, స్క్రబ్బింగ్, మసాజ్ వంటి అనేక రకాలుగా కష్టపడుతుంటారు. కానీ మెడ విషయానికి వస్తే, మనం వాటిని మరిచిపోతాం. మన అజాగ్రత్త వల్ల మెడ చుట్టూ ఉండే చర్మం చాలా నల్లగా మారుతుంది. మెడ దగ్గర చర్మం నల్లబడటానికి హైపర్పిగ్మెంటేషన్ కారణం కావచ్చు. కొన్నిసార్లు మెడ చర్మం నల్లబడటానికి కారణం మీరు తలకు ఉపయోగించే నూనె కూడా కారణం కావచ్చు. రాత్రి పడుకునే సమయంలో తలకు నూనె రాసుకుని పడుకుని.. ఉదయం లేచిన తర్వాత తలను మాత్రమే శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అయితే మెడను  సరిగ్గా శుభ్రం మరిచిపోతాం. ఇలా వదిలేయడం వల్ల మీ మెడ రంగు నల్లగా మారుతుంది. అంతే కాదు కొన్నిసార్లు మనం ధరించే ఆభరణాల వల్ల కూడా ఇలాంటి సమస్య వస్తుంటుంది.

అకాంథోసిస్ నైగ్రికన్స్ అని పిలువబడే హార్మోన్ల పరిస్థితి మెడ చుట్టూ చర్మం నల్లబడటానికి కూడా కారణమవుతుంది. హార్మోన్ల పరిస్థితుల కారణంగా చర్మం నల్లబడడాన్ని తొలగించడానికి వైద్య చికిత్స అవసరం. మెడ చర్మం నల్లబడటం సూర్యరశ్మికి గురికావడం, శుభ్రత లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. మీ మెడలోని నల్లటి చర్మాన్ని తిరిగి మామూలు చర్మం రంగులోకి ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం.. 

మెడలోని డార్క్‌నెస్‌ను తొలగించడానికి అలోవెరా జెల్‌ను అప్లై చేయండి: యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న కలబంద, చర్మంలోని నలుపు రంగును తొలగిస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి మెరుపును ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

అలోవెరా జెల్‌ను ఎలా ఉపయోగించాలి: తాజా కలబంద ఆకులను తీసుకుని వాటి లోపలి భాగంలో జల్ వంటిదానిలో అలోవెరా జెల్‌ను నేరుగా మీ మెడపై రాయండి. మృదువుగా మసాజ్ చేసి మెడపై ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఓ వారం రోజుల పాటు ఈ రెమెడీని అనుసరించండి. 

నిమ్మ,తేనె ఉపయోగించండి: నల్లని మెడ చర్మం వదిలించుకోవటంలో నిమ్మ రసం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా నిమ్మ రసం తీసుకుని ,అందులో తేనె కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి.. ఇలా తయారు చేసుకున్న పేస్టును మెడ భాగంపై అప్లై చేయండి. ఒక చెంచా తేనెలో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ను మెడకు పట్టించి, తర్వాత తడి గుడ్డతో శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేయండి: ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇందులో ఉండే మాలిక్ యాసిడ్ చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది.

ఎలా ఉపయోగించాలి: రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, నాలుగు టేబుల్ స్పూన్ల నీరు తీసుకుని వాటిని బాగా కలపాలి. తరువాత, ఒక కాటన్ బాల్ తీసుకొని.. ద్రావణంలో ముంచి మెడ చుట్టూ అప్లై చేయండి. పది నిమిషాలు అలాగే ఉంచి నీళ్లతో కడిగేయాలి. దీన్ని రోజూ వాడితే చర్మంలోని చీకటిని పోగొడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం