సాధారణంగా ద్రాక్ష పళ్లను తినేందుకు అందరు ఇష్టపడుతుంటారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి.. పెద్దవారి వరకు ద్రాక్ష పళ్లను ఇష్టంతో లాగించేస్తారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే ఈ ద్రాక్షను ఎక్కువ మోతాదులో తీసుకుంటే చాలా ప్రమాదమంటున్నారు నిపుణులు. ద్రాక్షను ఎక్కువగా తినడం వలన బరువు పెరుగుతారు. అంతేకాకుండా.. ఇందులో ఉండే స్వీట్.. కిడ్నీ సమస్యలను కలిగిస్తుంది. స్టైల్ క్రేస్ వార్తల ప్రకారం.. ద్రాక్షను అధికంగా తీసుకోవడం వలన కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే ద్రాక్షను పరిమితంగా తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కలిగి ప్రమాదమేంటో తెలుసుకుందమా..
ద్రాక్షను ఎక్కువగా తీసుకోవడం వలన విరేచనాలు ఇబ్బంది కలుగుతుంది. ఇందులో ఉండే తీపి విరేచనాలకు కారణమవుతుంది. సాధారణంగా కడుపు నొప్పి సమస్య ఉన్నవారు ద్రాక్షను ఎక్కువగా తీసుకోకుడదు.
మధుమేహం ఉన్నవారు ద్రాక్షను తినకూడదు. దీనిని అధికంగా తీసుకోవడం వలన కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే ద్రాక్షను ఎక్కువ పరిమాణంలో తినడం వలన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో మధుమేహం పెరగడం… మూత్ర పిండాలు దెబ్బతింటాయి.
బరువు తగ్గాలనుకునేవారు ద్రాక్షను తక్కువగా తీసుకోవాలి. వీటి వలన కేలరీలు పెరుగుతాయి. ద్రాక్షలో కేలరీల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్, కొవ్వు, పైబర్, కాపర్, విటమిన్ కె, థయామిన్ కూడా అధికంగా ఉంటాయి. ఎక్కువగా ద్రాక్షను తినడం వలన బరువు పెరుగుతారు. ద్రాక్షలో బలమైన పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి రెడ్ వైన్ లో కూడా కనిపిస్తాయి. వీటి వలన పుట్టబోయే బిడ్డలో ప్యాంక్రియాటిక్ సమస్యలు కనిపిస్తాయి. గర్భధారణ సమయంలో మహిళలు ద్రాక్షను తినేముందు వైద్యులను సంప్రదించాలి. ద్రాక్షను ఎక్కువ పరిమాణంలో తింటే, అది చేతులు మరియు కాళ్ళలో అలెర్జీ సమస్యలను కూడా కలిగిస్తుంది . ద్రాక్షలో లిక్విడ్ ప్రోటీన్ ట్రాన్స్‌ఫేరేస్ ఉంటుంది, ఇది అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఈ రకమైన అలెర్జీ యొక్క లక్షణాలు దురద, దద్దుర్లు మరియు నోటి వాపు. ద్రాక్ష అనాఫిలాక్సిస్‌కు కూడా కారణమవుతుంది.
Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..
Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..
Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…