Radish Benefits: చలికాలంలో ముల్లంగి తింటే ఈ సమస్యలు తగ్గుతాయి… ప్రయోజనాలు తెలుసుకోండి..

ముల్లంగి.. క్యారెట్ మాదిరిగానే భూమిలో పండుతుంది.. దీనిని ర్యాడిష్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా చలికాలంలో లభిస్తుంది.

Radish Benefits: చలికాలంలో ముల్లంగి తింటే ఈ సమస్యలు తగ్గుతాయి... ప్రయోజనాలు తెలుసుకోండి..
Radish

Updated on: Nov 22, 2021 | 8:04 AM

ముల్లంగి.. క్యారెట్ మాదిరిగానే భూమిలో పండుతుంది.. దీనిని ర్యాడిష్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా చలికాలంలో లభిస్తుంది. ముల్లంగితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా..అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. ముల్లంగి చర్మానికి కూడా మేలు చేస్తుంది. సాధారణంగా.. చలికాలంలో వ్యాధుల సమస్య ఎక్కువగా వేధిస్తుంటాయి. సీజనల్ వ్యాధులను నిరోధించి.. ఇమ్యూనిటీ పెంచడంలోనూ ముల్లంగి సహయపడుతుంది. ఇందులో విటమిన్ సి, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, ఫైబర్, షుగర్ పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో ముల్లంగిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయి. ఇందులో కాల్షియం, పొటాషియం గుండె జబ్బులను తగ్గిస్తుంది. అలాగే మరిన్ని ప్రయోజనాలున్నాయి.

ముల్లంగి రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రిస్తుంది. అలాగే ఇన్సులిని స్థాయిలను సమతుల్యం చేయడంలోనూ సహాయపడుతుంది. అలాగే మధుమేహం ఏర్పడకుండా నిరోధించే అనేక ఎంజైములు ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలోనూ సహాయపడుతుంది. అలాగే కడపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. రోజూ ముల్లంగిని సలాడ్ గా తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్, ఆంథోసైనిన్లు ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఈ, బి6, పొటాషియం వంటి అనేక పోషకాలున్నాయి. ముల్లంగిలో భాస్వరం, జింక్ చలికాలంలో పొడి చర్మానికి పోషణనిస్తుంది. అలాగే ముఖంపై దద్దర్లు, అలెర్జీలు వంటివి నియంత్రిస్తుంది. శరీరంలో నీటి కొరతను అధిగమించడానికి ముల్లంగిని తీసుకోవాలి. శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఉండదు. శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ముల్లంగి శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. శరీరంలో సోడియం పెరగడం వలన అధిక రక్తపోటు సమస్య వస్తుంది.

Also Read: Gamanam: ప్రేక్షకుల ముందుకు గమనం.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రయూనిట్.

Kaikala Satyanarayana: విషమంగానే కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేట్.. ఒక్కొక్కరికి గురించి ఏం చెప్పిందంటే..