Pumpkin Benefits: బరువు తగ్గించే గుమ్మడి కాయ.. ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..

|

Nov 22, 2021 | 7:26 AM

సాధారణంగా గుమ్మడి కాయను కేవలం శుభకార్యాలకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. గుమ్మడి కాయతో చేసిన వంటకాలను

Pumpkin Benefits: బరువు తగ్గించే గుమ్మడి కాయ.. ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..
Pumpkin
Follow us on

సాధారణంగా గుమ్మడి కాయను కేవలం శుభకార్యాలకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. గుమ్మడి కాయతో చేసిన వంటకాలను తినేవారు చాలా తక్కువ. అలాగే ఈ గుమ్మడి కాయ చేసే మేలు గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ దీనిని తినడం వలన కలిగే ప్రయోజనాలు మాత్రం అధికం. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ గుమ్మడికాయ ఆరోగ్యానికి.. జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను ఇస్తుందో తెలుసుకుందామా.

1. గుమ్మడికాయ ఎముకలను బలంగా మారుస్తుంది. గుమ్మడికాయలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
2. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహయపడుతుంది.
3. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో బీటా కెరటిన్ ఉంటుంది. కంటి ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.
4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ ఎ, సీ, ఈ, బీటా, కెరోటిన్, ఫైబర్, రిబోఫ్లావిన్, పొటాషియం వంటి పోషకాలున్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రభావంతంగా ఉంటుంది.
5. గుమ్మడి కాయ బరువు తగ్గించడంలోనూ సహయపడుతుంది. ఇందులో యాంటీ ఒబెసిటీ గుణాలు ఉన్నాయి. బరువును నియంత్రిస్తాయి.
గుమ్మడికాయ జుట్టుకు మేలు చేస్తుంది. దీనిని తినడంతో పాటు.. హెయిర్ పేస్ట్ గా కూడా ఉపయోగించవచ్చు. గుమ్మడి కాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జుట్టుకు హెయిర్ మాస్క్ గా ఉపయోగించడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు.. జుట్టు రాలడం తగ్గించి.. మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ఇందుకోసం ఒక కప్పు పండిన పసుపు గుమ్మడి కాయ ముక్కలను మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.

Also Read: Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేట్.. ఒక్కొక్కరికి గురించి ఏం చెప్పిందంటే..

Kaikala Satyanarayana: విషమంగానే కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల