దంతాలను శుభ్రం చేసుకుంటున్నారా..? రోజుకు ఎన్నిసార్లు చేసుకుంటున్నారు..? ఎలా శుభ్రం చేసుకుంటున్నారు..? ఈ అంశాలు మీ ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపిస్తాయి. దంతాలను శుభ్రపరచడం అంటే వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించుకోవడమే.. అంతే కాకుండా ఇది మీ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అన్ని రకాల శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. తాజా అధ్యయనంలో దీని గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ’లో ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం.. కర్ణిక దడ, గుండె వైఫల్యం మధ్య సంబంధం దంతలను శుభ్రతపై ఆధారపడి ఉందని గుర్తించారు. మన నోరు బ్యాక్టీరియాకు ప్రవేశ ద్వారం అని ఆ నివేదికలో పేర్కొన్నారు.
మంచి , చెడు బ్యాక్టీరియా దాని నుండి మన శరీరంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. అయితే ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు నోరు కేంద్రం అని తెలిపారు. అవనా హెల్త్‌కేర్ సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ శిల్పి బెహ్ల్ వెల్లడించింన దాని ప్రకారం, ‘మీ నోటి ఆరోగ్యం అనేక వ్యాధులకు కారణం కావచ్చు. మీరు ఎండోకార్డిటిస్ బాధితుడు కూడా కావచ్చు. ఇది మీ గుండె గది లోపలి లైనింగ్‌లో సంభవించే ఒక రకమైన ఇన్ఫెక్షన్. నోటి మార్గం ద్వారా శరీరంలో వ్యాపించే బ్యాక్టీరియా రక్తప్రవాహం ద్వారా మానవ హృదయానికి చేరుకున్నప్పుడు ఎండోకార్డిటిస్ బాధితులుగా మారతారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, దంతాలను శుభ్రపరచడంలో అజాగ్రత్తతో చిగుళ్ల వ్యాధి ప్రాణాంతక పీరియాంటైటిస్‌కు దారి తీస్తుంది. తరువాత, ఈ వ్యాధి గుండె జబ్బులు, రక్త ధమనులలో సమస్యలు, స్ట్రోక్ సమస్యను కూడా ప్రేరేపిస్తుంది. పీరియాంటైటిస్ లేదా పేలవమైన నోటి ఆరోగ్యం, అకాల పుట్టుక , తక్కువ జనన బరువు మధ్య సంబంధం కూడా ఉంది. నోటి ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి? రోజుకు కనీసం రెండు సార్లు టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయండి.
రోజూ దంతాలను శుభ్రపరచండి. బ్రష్ లేదా ఫ్లాస్ చేసిన తర్వాత నోటిలో ఆహార కణాలు మిగిలి ఉంటే వాటి కోసం మౌత్ వాష్ ఉపయోగించండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అధిక చక్కెర ఆహారాలు లేదా పానీయాలను తీసుకోకుండా ఉండండి. ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు మీ టూత్ బ్రష్ మార్చండి. దంతాలను శుభ్రపరచడం.. చెక్ చేయడం కోసం దంతవైద్యునిచే రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోండి. పొగాకు లేదా అలాంటి వాటిని తీసుకోవడం మానుకోండి.
ఇవి కూడా చదవండి: Leptin and Obesity: మీలో ఈ హార్మోన్లు పనిచేయకపోతే డయాబెటిస్ వచ్చినట్లే.. అవేం చేస్తాయో తెలుసా..
Kishan Reddy: ఆయన మొండి వైఖరి వల్లే రైతులకు తీవ్ర నష్టం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..