
చలికాలం అంటేనే ప్రతి ఒక్కరు జలుబు లేదా దగ్గుతో రెండింటితో కచ్చితంగా బాధపడుతుంటారు. సాధారణంగా ఉండే వారైతే మెడికల్ షాప్ నకు వెళ్లి ఏవో ఒక ట్యాబ్లెట్స్ తెచ్చుకుని వాడుతుంటారు. అదే మధుమేహంతో బాధపడేవారి జలుబు, దగ్గు వస్తే వారి బాధ వర్ణనాతీతం. ఎందుకంటే బయట ట్యాబ్లెట్స్ వాడవచ్చా? లేదా? అనుమానంతో జలుబు, దగ్గును ఇంకా పెరిగేలా చేసుకుంటారు. అసలు మధుమేహంతో బాధపడేవారు జలుబు, దగ్గు వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
వైద్య నిపుణులు డిసెంబర్, జనవరి నెలల్లో వచ్చే జలుబు, దగ్గు సమస్యలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ కు జలుబు చేస్తే వారికి ఆటోమెటిక్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెబుతున్నారు. జలుబు అనే కాదు వారికి శరీరంలో ఎలాంటి ఇన్ ఫెక్షన్ వచ్చినా చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులను గమనించవచ్చని పేర్కొంటున్నారు. కాబట్టి మధమేహ వ్యాధి గ్రస్తులు జలుబు, దగ్గు సమస్యతో బాధపడితే తగినంత పోషకాహారం, ముఖ్యంగా కార్భోహైడ్రేట్లు తీసుకోవడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
ఎలాంటి అనారోగ్యంతో బాధపడేవారైనా ధ్రవాలు, లేదా ధ్రవ ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది డీహైడ్రేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. సో మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా అధికంగా నీటిని తీసుకుంటే షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గుల సమస్య నుంచి బయటపడవచ్చు. సో షుగర్ వ్యాధిగ్రస్తుల అధికంగా నీటిని తీసుకోవడం లేదా షుగర్ ఫ్రీ డ్రింక్స్ తాగడం ఉత్తమం.
జలుబు, దగ్గు సమస్యతో బాధపడే షుగర్ పేషెంట్లు వీలైనంత మేర సాధారణ భోజన పద్ధతిని పాటించాలి. లేకపోవతే కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినాలి. అలాగే భోజనం స్థానంలో సూప్, పాలు, పండ్ల రసాలు వంటి అధిక కార్భోహైడ్రేట్లు కలిగిన పానియాలు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.
అనారోగ్యానికి గురైన వారికి రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. దీంతో తరచూ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. కనీసం రోజుకు నాలుగు సార్లు షుగర్ చెక్ చేసుకుంటే మంచిది.
డయాబెటిక్ పేషెంట్స్ ఇతర అనారోగ్య సమస్యలకు గురైనప్పుడు ఏ ట్యాబ్లెట్ పడితే దాన్ని వాడకూడదు. ఎందుకంటే కొన్ని ఔషధాలు చక్కెర స్థాయిని ప్రభావితం చేసే గుణాలుంటాయి. సో వైద్యుల సలహా మేరకే జలుబు, దగ్గుకు సంబధించిన మందులు వాడాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి