Singer KK Death: ప్రసిద్ధ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ (KK) మరణం అందర్ని కలిచివేస్తోంది. వేలాది మధురమైన పాటలలో KK గా ప్రసిద్ది చెందిన ఆయన అకస్మాత్తుగా మరణించడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నజ్రుల్ మంచ్ వివేకానంద కళాశాలలో జరిగిన కాలేజ్ ఫేస్ట్‌లో పాల్గొన్న 53 ఏళ్ల కేకే.. కొన్ని గంటల తర్వాత మంగళవారం రాత్రి కోల్‌కతాలో మరణించారు. వేలాది మంది పాల్గొన్న ఈ ప్రదర్శనలో దాదాపు గంటపాటు పాడిన కేకే.. ఆ తర్వాత తన హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. వెంటనే అతడిని దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అసహజ మరణంగా కేసు కూడా నమోదైంది. కుటుంబసభ్యుల అంగీకారం లభించిన తర్వాత ఈ రోజు పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉంది. అతని కుటుంబ సభ్యులు అతని భౌతికకాయాన్ని తిరిగి ముంబైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేకేకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా.. సింగర్ కేకే ప్రదర్శన సమయంలో ఫిట్‌గా కనిపించారు. ఇండోర్ వేదికపై ఉన్న సమయంలో తీవ్రంగా చెమటలు పట్టడం, నీరసంగా అసంతృప్తితో ఉన్నట్లు కనిపించారు.. వేదిక వద్ద సరైన ఎయిర్ కండిషనింగ్ ఉండేలా ఏర్పాట్లు చేయకపోవడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అయితే.. క్లోజ్డ్ వెన్యూలో (గాలి సరిగా లేని ప్రదేశం) ప్రదర్శన చేయడం వల్ల శరీరంలో ఖచ్చితంగా ఒక విధమైన భయాందోళన లేదా ప్రతికూల ప్రతిచర్యలు ఏర్పడే అవకాశం ఉందని కార్డియాక్ సర్జన్ డాక్టర్ మనోజ్ లూత్రా పేర్కొన్నారు. ప్రస్తుతం కేకే మరణంపై పలు కథనాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో దీబాశ్రీ మొహంతి, ఉన్నతి గుసేన్ న్యూస్9తో పలు విషయాలను పంచుకున్నారు.
కాలేజీ ఫెస్ట్‌లో ప్రదర్శన ఇవ్వడానికి కొన్ని గంటల ముందు KK ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిగా పోస్ట్ చేశాడు. ఒక చిత్రంలో అతను మైక్‌ను పట్టుకుని, మరొక చిత్రంలో ఆయన ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.
అయితే.. కొన్ని వీడియోలలో అతను వేదికపై విపరీతంగా చెమటలు పట్టడం, టవల్‌తో అతని ముఖాన్ని తుడుచుకోవడం, వేదిక వద్ద ఎయిర్ కండిషనింగ్ గురించి ఫిర్యాదు చేయడం కూడా చూపిస్తుంది. గాయకుడు తన చివరి ప్రదర్శన సమయంలో ‘ఫిట్’గా కనిపించినప్పటికీ – అనేక మంది అభిమానులు ఆయన అంత బాగా కనిపించలేదని పేర్కొంటున్నారు. ఒక విధంగా మంచిగా కనిపించలేదని.. ప్రదర్శనలో చెమటలు పడుతూ కనిపించారని ఈ కార్యక్రమానికి హాజరైన కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు. KK తనపై ఉన్న స్పాట్‌లైట్‌లపై అదేవిధంగా వేదిక చుట్టూ రద్దీగా ఉండటంపై నిర్వాహకులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
‘‘జ్రుల్ మంచాలో AC పని చేయడం లేదు. కేకే అక్కడ ప్రదర్శన ఇచ్చారు.. అతనికి బాగా చెమటలు పట్టడం వల్ల ఫిర్యాదు కూడా చేశారు. అది ఓపెన్ ఆడిటోరియం కాదు. దానిని దగ్గరగా చూడండి.. చెమటలు పడుతున్న తీరు, మూసి ఉన్న ఆడిటోరియం, రద్దీగా ఉన్న తీరు మీరు చూడవచ్చు. అధికార నిర్లక్ష్యం వల్లే లెజెండ్ మనల్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది.’’ అంటూ ఓ అభిమాని తన ట్వీట్‌తో వీడియోను షేర్ చేశాడు.
వీడియో..
AC wasn’t working at Nazrul Mancha. he performed their and complained abt it bcoz he was sweating so badly..it wasnt an open auditorium. watch it closely u can see the way he was sweating, closed auditorium, over crowded,
Legend had to go due to authority’s negligence.
Not KK pic.twitter.com/EgwLD7f2hW— WE जय (@Omnipresent090) May 31, 2022
భారీ జనసమూహం ఉన్న ఇండోర్ వేదికలు, సరైన వెంటిలేషన్ లేకపోవడం తీవ్రమైన క్లాస్ట్రోఫోబియాకు దారితీయవచ్చు..
సామాజిక మాధ్యమంలో కేకే మరణం తర్వాత వెలువడిన వీడియోలను చూస్తే.. భారీ జనసందోహంతో నిండిన గదిలా కనిపిస్తోంది. అయితే.. భారీగా జనం ఉన్న ఇండోర్ వేదికలు తీవ్రమైన క్లాస్ట్రోఫోబియాతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.. దీని ఫలితంగా గుండెపోటు.. ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌లు సంభవించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
క్లాస్ట్రోఫోబియా..
క్లాస్ట్రోఫోబియా అనేది ఆందోళన రుగ్మత.. ఈ ఆందోళన భావన శరీరంలో ఆకస్మిక ప్రతిచర్యకు దారితీస్తుందని, ఇది గుండెలో ఒత్తిడిని కలిగిస్తుందని కార్డియాక్ సర్జన్ డాక్టర్ మనోజ్ లూత్రా News9 కి చెప్పారు. “క్లాస్ట్రోఫోబియా అనేక కారణాల వల్ల ఉత్పన్నమవుతుంది. ఇండోర్‌లో ప్రదర్శన చేయడం వల్ల ఏ ప్రదర్శకుడి శరీరంలోనైనా ఒక విధమైన భయాందోళనలు లేదా ప్రతికూల ప్రతిచర్యలు ఏర్పడతాయి. ప్రదర్శన ఇచ్చే వ్యక్తి ఆందోళన చెందకుండా ఉండడానికి చేసే చర్యలంటూ ఏమీ లేవు” అని ఆయన చెప్పారు.
గుండెకు ప్రమాదం..
గుండె రుగ్మతలతో ఆందోళనకు సుధీర్ఘ అనుబంధం ఉందని డాక్టర్ లూత్రా స్పష్టం చేశారు. ‘‘తీవ్రమైన సందర్భాల్లో, క్లాస్ట్రోఫోబియా సాధారణ గుండె పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది.. అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇతర సందర్భాల్లో ఇది గుండె కండరాల బలహీనతకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రకమైన ఆందోళన గుండె వ్యాధులకు కూడా దారితీయవచ్చు. హృదయ స్పందన వేరియబిలిటీని తగ్గిస్తుంది’’ అని ఆయన వివరించారు.
కానీ అలాంటి భయాందోళనలకు ఏవైనా గుర్తించదగిన లక్షణాలు ఉన్నాయా? అకస్మాత్తుగా గుండె ఆగిపోతే మనం అనుభవించే పరిస్థితులను పోలి ఉంటాయా? దీనిపై డాక్టర్ లూత్రా మాట్లాడుతూ.. మొదటి, అన్నిటికంటే రెండూ చాలా భిన్నమైన ఆరోగ్య పరిస్థితులు. భయాందోళన లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు దారితీయవచ్చు. తేలికపాటి తలనొప్పి, చెమటలు, వేగవంతమైన హృదయ స్పందన రేటు, అతిగా శ్వాస తీసుకోవడం, వణుకు వంటి అనుభూతి ఉంటుంది. ఇవి సాధారణ లక్షణాలు. అయితే వాటిని చాలా తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే కేవలం పానిక్ అటాక్‌గా కనిపించి.. అకస్మాత్తుగా స్ట్రోక్, గుండెపోటుకు దారి తీస్తుంది’’ అని ఆయన చెప్పారు.
ఒక వ్యక్తికి గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉంటే లేదా కఠినమైన జీవనశైలిని అనుసరించకపోతే బాహ్య కారకాలు (క్లాస్ట్రోఫోబియా లేదా వేడి లేదా రద్దీగా ఉండే వాతావరణం వంటివి) గుండె వైఫల్యాన్ని మరింత ప్రేరేపించే అవకాశం ఉందని డాక్టర్ లూత్రా చెప్పారు.
చాలా ఈవెంట్‌లలో ఆరోగ్యానికి సంబంధించిన మార్గర్శకాలను నిర్వాహాకులు సరిగా పాటించరు.
న్యూ ఢిల్లీ, గుర్గావ్‌లలో ఈవెంట్ ఏజెన్సీని కలిగి ఉన్న రిషబ్ అగర్వాల్ మాట్లాడుతూ.. చాలా ఈవెంట్‌లు ప్రామాణిక SOPలను అనుసరిస్తాయని, అయితే ఆరోగ్యానికి సంబంధించిన నిర్దిష్ట ఆదేశాలు తరచుగా పక్కన పెడుతుంటారని ఆయన పేర్కొన్నారు.
‘‘మనలో చాలా మందికి (ఈవెంట్ మేనేజర్‌లు) ఈవెంట్‌కి సంబంధించిన ఆరోగ్య-నిర్దిష్ట SOPలు ఏమిటో తెలియదు. మేము ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోసం కఠినమైన ప్రోటోకాల్‌ల ప్రకారం పని చేస్తున్నాము. ఇందులో వేదిక – ప్రేక్షకులు ఎక్కడ కూర్చోవాలి, వేదికల వద్ద తగినంత వెంటిలేషన్, నంబర్ సీటింగ్ కెపాసిటీ చూసుకుంటాం.. ఇవి శాస్త్రీయంగా నిరూపితమైన ఆపరేటింగ్ విధానాలను మేము తీవ్రంగా పరిగణిస్తాం’’ అని ఆయన చెప్పారు.
కానీ ఇండోర్ వేదిక లోపల సరైన వెంటిలేషన్ సాధ్యమేనా? అనే దానిపై మాట్లాడుతూ.. దానికి భిన్నమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ చాలా ఏజెన్సీలు దానిని విస్మరిస్తాయి. సీటింగ్ కెపాసిటీ అనేది మరొక మార్గదర్శకం, అయితే.. ఇది కొన్ని సందర్భాల్లో విస్మరించరు’’. అని అగర్వాల్ చెప్పారు.
బాగా వెంటిలేషన్ లేని గదిలో (ఇండోర్) ప్రదర్శనకారుడు /లేదా ప్రేక్షకులకు తీవ్రమైన ఆరోగ్య ఫలితాలకు దారితీస్తుందని వారికి తెలుసా? ‘‘ వాస్తవంగా చెప్పాలంటే, మేము ఇప్పటి వరకు ఈ రకమైన ప్రమాదాన్ని ఎదుర్కోలేదు. కానీ ఒక ప్రదర్శనకారుడు వేదికపై ఒత్తిడి లేకుండా, చాలా తేలికగా ఉండాలనేది మాకు తెలుసు. వేదికలో ఏవైనా అవాంతరాలు కూడా కలిగించవచ్చు. దీంతో ప్రదర్శకుడిలో భయాందోళన కలుగుతుంది. అందుకే మేము సాధారణంగా డ్రెస్ రిహార్సల్ లేదా వేదిక దగ్గర ఏర్పాట్లను పరిశీలిస్తాం అని చెప్పారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..