Kidney Failure: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి.. లేకపోతే మూత్రపిండాలు ప్రమాదంలో పడినట్లే..

|

Jul 16, 2022 | 12:34 PM

మూత్రపిండాల పనితీరు మందగిస్తే.. శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని సందర్భాల్లో కిడ్నీ సమస్యలు ప్రాణాంతకం కూడా కావొచ్చు.

Kidney Failure: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి.. లేకపోతే మూత్రపిండాలు ప్రమాదంలో పడినట్లే..
Kidney
Follow us on

Kidney Failure Symptoms: ఆరోగ్యంగా ఉండేందుకు శరీరంతోపాటు ముఖ్యమైన అవయవాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. మూత్రపిండాల పనితీరు మందగిస్తే.. శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని సందర్భాల్లో కిడ్నీ సమస్యలు ప్రాణాంతకం కూడా కావొచ్చు. సాధారణంగా మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలు మూత్రపిండాలపై ప్రభావం చూపుతాయి. మన కిడ్నీల ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వైద్యులు రక్తం, మూత్ర పరీక్షలు చేస్తారు. వీటి సహాయంతో అల్బుమిన్ అనే ప్రోటీన్‌ గురించి తెలుస్తోంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాలలో ఇది ఉండదు. మూత్రపిండాల ముఖ్యమైన పని ఏంటంటే మన శరీరంలోని ద్రవాలను ఫిల్టర్ చేసి, ఆరోగ్యంగా ఉంచుతుంది.

కిడ్నీ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం..

మూత్రపిండాలను ఆరోగ్యంగా కాపాడుకోవాలనుకుంటే, దీని కోసం శరీరంలో సరైన మొత్తంలో నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్‌ను ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

మూత్రపిండాల వైఫల్యాన్ని నివారించడానికి చిట్కాలు..

  • మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. శారీరక శ్రమను తగ్గించుకోవద్దు.
  • కిడ్నీ ఆరోగ్యానికి రక్తపోటు నియంత్రణ ఉండేలా చూసుకోవాలి.
  • డయాబెటిక్ పేషెంట్లకు ఎక్కువ ప్రమాదం ఉన్నందున చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోండి.
  • రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే చేర్చుకోవాలి.
  • నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. తక్కువగా లేదా ఎక్కువగా తీసుకున్న ప్రమాదమే. ఇది మూత్రపిండాలను ఫిల్టర్ చేయడంలో సమస్యలను కలిగిస్తుంది.
  • ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.
  • బరువు పెరగకుండా చూసుకోండి. వీలైనంత వరకు బెల్లీ ఫ్యాట్, శరీరంలో కొవ్వును తగ్గించడానికి ప్రయత్నించండి.
  • ఉప్పు ఎక్కువగా తీసుకోవడం నియంత్రించండి. ఎందుకంటే ఇది BP ని పెంచుతుంది.
  • వైద్యుల అభిప్రాయం ప్రకారం రోజుకు 5 నుంచి 6 గ్రాముల ఉప్పు మాత్రమే తినాలి.
  • క్షీణిస్తున్న జీవనశైలిని మార్చుకోండి. సరైన దినచర్యను అనుసరించండి.
  • తాజా ఆహారాన్ని మాత్రమే తినడానికి ప్రయత్నించండి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.
  • సిగరెట్, బీడీ, హుక్కా లాంటి వాటికి దూరంగా ఉండండి.
  • కొన్ని రకాల మందులు కిడ్నీని దెబ్బతీస్తాయి. కావున వినియోగించే ముందు వైద్యుల సలహా తీసుకోండి.
  • కిడ్నీ పాడవడానికి మద్యపానం కూడా ప్రధాన కారణం ఈ వ్యసనాన్ని విడిచిపెట్టండి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..