AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే యమడేంజర్.. మీ కిడ్నీలను కాపాడుకోండి..

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి.. ఇది శరీరం నుండి మలినాలను తొలగించడానికి పనిచేస్తుంది. కిడ్నీలు లేకుండా శరీరం పనిచేయడం కష్టం. కిడ్నీ వైఫల్యానికి ముందే, మన శరీరం సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు కనిపించే ఈ లక్షణాలను విస్మరించకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే యమడేంజర్.. మీ కిడ్నీలను కాపాడుకోండి..
Kidney Damage Symptoms
Shaik Madar Saheb
|

Updated on: Oct 01, 2025 | 3:24 PM

Share

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు (కిడ్నీలు) ఒకటి.. కిడ్నీలు శరీరం నుంచి మలినాలను తొలగించడానికి పనిచేస్తాయి.. మూత్రపిండాలు లేకుండా, శరీరం పనిచేయడం కష్టం. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయి.. అందుకే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం. మూత్రపిండాల వైఫల్యానికి ముందే, మన శరీరం సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. అయితే.. కిడ్నీ వ్యాధులకు సంబంధించి రాత్రిపూట కొన్ని సంకేతాలు కనిపిస్తాయని.. వాటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూత్రపిండాల దెబ్బతిన్నప్పుడు.. రాత్రి వేళ కనిపించే లక్షణాలేంటో తెలుసుకోండి..

రాత్రిపూట తరచూ మూత్ర విసర్జన: మూత్ర విసర్జన శరీరం సాధారణ పని.. కానీ రాత్రిపూట అధికంగా మూత్ర విసర్జన చేయడం మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం. మూత్రపిండాలలో ఏదైనా సమస్య మొదట మూత్రం ఏర్పడటాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు నిద్రలో కూడా మూత్ర విసర్జన చేస్తుంటే.. ఈ లక్షణాన్ని విస్మరించవద్దు.

అధికంగా చెమటలు: వేసవిలో అందరికీ చెమటలు పడతాయి, కానీ రాత్రిపూట అధిక చెమటలు పట్టడం మూత్రపిండాల వైఫల్యానికి హెచ్చరిక సంకేతం కావచ్చు. దీనివల్ల శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు పెరుగుతాయి..

తీవ్రమైన రక్తపోటు: అధిక రక్తపోటు మూత్రపిండాలు దెబ్బతిన్నాయనడానికి సంకేతం కావచ్చు. మూత్రపిండాలలో లోపం ఉన్నప్పుడు, అవి క్రియేటినిన్‌ను ఫిల్టర్ చేయలేవు, అటువంటి పరిస్థితిలో, క్రియేటినిన్ రక్త నాళాలలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది.. అంతేకాకుండా.. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేసి.. రక్తపోటును పెంచుతుంది.

వాంతులు – వికారం: వాంతులు కూడా మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం. రాత్రి భోజనం తర్వాత మీరు తరచుగా వాంతులు చేసుకుంటే లేదా వికారం అనిపిస్తే, అది మూత్రపిండాలు దెబ్బతిన్నాయనడానికి సంకేతం. అటువంటి లక్షణాలను విస్మరించడం ప్రమాదకరం.

పాదాల నొప్పి: ఎటువంటి కారణం లేకుండా మీ పాదాలలో నొప్పి ఉంటే, అది సాధారణం కాదు. శరీరంలో క్రియాటినిన్ స్థాయి పెరిగినప్పుడు, పాదాల నొప్పి సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే పాదాలలో క్రియాటినిన్ పెరిగిన మొత్తం పేరుకుపోతుంది.

కావున ఈ లక్షణాలను అస్సలు విస్మరించవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు ఏమైనా సమస్యలుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స పొందండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?