China Pneumonia Virus: చైనాలో విజృంభిస్తోన్న న్యుమోనియా.. ప్రజలను అప్రమత్తం చేసిన ఆ రెండు రాష్ట్రాలు!

చైనాలో పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వ ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను అలర్ట్ మోడ్‌లో ఉంచింది. చైనాలో న్యుమోనియా వ్యాప్తికి కారణమైన సీజనల్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతున్నందున రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ జారీ..

China Pneumonia Virus: చైనాలో విజృంభిస్తోన్న న్యుమోనియా.. ప్రజలను అప్రమత్తం చేసిన ఆ రెండు రాష్ట్రాలు!
China New Virus

Updated on: Nov 29, 2023 | 11:43 AM

బెంగళూరు, నవంబర్‌ 29: చైనాలో పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వ ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను అలర్ట్ మోడ్‌లో ఉంచింది. చైనాలో న్యుమోనియా వ్యాప్తికి కారణమైన సీజనల్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతున్నందున రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో కీలక అంశాలు ఇవే..

సీజనల్ ఫ్లూ అనేది ఇన్‌ఫెక్షనల్ డిసీజ్‌. ఇది సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల పాటు కొనసాగే ఒక అంటు వ్యాధి. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది పిల్లలతోపాటు వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి లేనివారికి సోకితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంటుంది. స్టెరాయిడ్స్ వంటి దీర్ఘకాలిక ఔషధాలను తీసుకునే వారికి ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

లక్షణాలు

జ్వరం, చలి, అస్వస్థత, ఆకలి లేకపోవడం, మైయాల్జియా, వికారం, తుమ్ములు, మూడు వారాల వరకు పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తీసుకోవల్సిన జాగ్రత్తలు

  • ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు చేయవలసినవి చేయకూడని కొన్ని ముఖ్య సూచనలు ఇవే..
  • దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం
  • తరచుగా చేతులు కడుక్కోవడం
  • అనవసరంగా చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండటం
  • రద్దీగా ఉండే ప్రదేశాలలో ఫేస్ మాస్క్‌లను ధరించడం

ప్రస్తుత పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఉత్తర చైనాలోని పిల్లలలో శ్వాసకోశ అనారోగ్యం పెరుగుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కథనాల దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శ్వాసకోశ వ్యాధుల నివారణకు సంసిద్ధత చర్యలను సమీక్షించాలని నిర్ణయించింది. శీతాకాలంలో ఇన్‌ఫ్లుఎంజా కారణంగా శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు కారణమవుతుంది. ప్ర

స్తుతానికి ఎలాంటి ప్రమాద ఘటికలు మోగించాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజారోగ్యం, ఆసుపత్రి సన్నద్ధత చర్యలను తక్షణమే సమీక్షించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అడ్వైజరీ రిపోర్ట్‌ జారీ చేసిన తర్వాత కర్ణాటక ప్రభుత్తం తాజా నిర్ణయం తీసుకుంది.

ఉత్తరాఖండ్‌లోనూ హెచ్చరికలు జారీ..

ప్రజారోగ్యంపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాఖండ్‌లో చైనా సరిహద్దు కలిగిన మూడు జిల్లాలు.. చమోలి, ఉత్తరకాశీ, పితోరాఘర్‌లలో ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.