మధుమేహం ఉన్న వారు పండ్లు తినవచ్చా? సాధారణంగా దీనికి వద్దు అనే సమాధానమే వస్తుంది. రోగుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలుంటాయి. కొంత గందరగోళం కూడా ఉంటుంది. వాస్తవానికి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. వీటిలోని ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే పండ్లు మధుమేహ రోగులు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు. ఈనేపథ్యంలో అసలు మధుమేహ వ్యాధి గ్రస్తులు పండ్లను ఎలా తినాలి? ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తినాలి? అనే విషయాలపై నిపుణులు చెబుతున్న విషయాలను చూద్దాం..
నిపుణుల తాజా పరిశోధన ప్రకారం, రోజుకు బ్లూబెర్రీస్, ద్రాక్ష, యాపిల్ వంటి పండ్లు, పచ్చిగా కాయమొత్తం తింటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. ఒకవేళ ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్ ఉంటే.. రోజుకు ఒక పచ్చి పండును తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందని మరొక అధ్యయనం సూచిస్తుంది. అయితే కొన్ని షరతలు వర్తిస్తాయి.
షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకొనే పండ్లలోని గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) ఆధారంగా చేసుకొని తినే పండ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకొనే పండ్లలో ఈ జీఐ తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అతి తక్కువ జీఐ స్థాయి అంటే 20 నుంచి 49 వరకూ.. ఆపిల్, అవకాడోలు, చెర్రీస్, జామ, పీచెస్, బేరి మరియు స్ట్రాబెర్రీలలో ఈ స్థాయి జీఐ ఉంటుంది. అలాగే మధ్యస్థ స్థాయి జీఐ 50 నుంచి 69 వరకూ.. ద్రాక్ష, నారింజలు కలిగి ఉంటాయి. అలాగే అధిక జీఐ స్థాయి అంటే 70 కి పైన మామిడి, ఖర్జూరాలు వంటి పండ్లలో ఉంటాయి. అందువల్ల మీరు షుగర్ ను అదుపులో ఉంచుకోవాలనుకొంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు తీసుకోవాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..