Health Tips: ఆ సమయంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..

|

Jul 28, 2023 | 6:12 PM

Curd during pregnancy: పెరుగు చాలా పోషకమైన ఆహారం. క్రమం తప్పకుండా ప్రతి రోజు మధ్యాహ్నం పెరుగు తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పైగా పెరుగులో దాదాపు 90 శాతం నీటితో పాటు.. కొవ్వులు, మినరల్స్, ప్రోటీన్, కార్బొహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పోషకాహారాలను తప్పక..

Health Tips: ఆ సమయంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Curd during pregnancy
Follow us on

Curd during Pregnancy: పెరుగు చాలా పోషకమైన ఆహారం. క్రమం తప్పకుండా ప్రతి రోజు మధ్యాహ్నం పెరుగు తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పైగా పెరుగులో దాదాపు 90 శాతం నీటితో పాటు.. కొవ్వులు, మినరల్స్, ప్రోటీన్, కార్బొహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పోషకాహారాలను తప్పక తీసుకోవాల్సిన గర్భిణీలు పెరుగు తినేందుకు పెద్దగా ఇష్టపడరు. పెరుగు తింటే బిడ్డకు హాని కలుగుతుందని భావిస్తుంటారు. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమేనని పలువురు గైనకాలజిస్టులు, వైద్య నిపుణులు చెబుతున్నారు.

గర్భిణీలు పెరుగు తినడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుందని, శరీరానికి కావలసిన పోషకాలు, నీరు లభిస్తాయని వరాు చెబుతున్నారు. పైగా గర్భిణీలకు పెరుగు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది. అలాగే నేషనల్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా గర్భిణీలు తప్పకుండా రోజూ పెరుగు తినాలని సూచిస్తోంది. ఇంకా పెరుగు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పలువురు నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పెరుగు తినడం వల్ల గర్భిణీలకు కలిగే ప్రయోజనాలు..

  • పెరుగులోని ప్రోబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా, విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఈ శక్తి కారణంగా సీజనల్ సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి శరీరం తనను తను రక్షించుకోగలుగుతుంది.
  • గర్భధారణ సమయంలో కలిగే మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో పెరుగు ఉపయోగపడుతుంది. డిప్రెషన్ నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
  • గర్భిణీల్లో అధిక రక్తపోటు సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీన్ని పెరుగులోని యాంటీ-హైపర్‌టెన్సివ్ ప్రభావం నియంత్రించగలదు.
  • పెరుగులోని కాల్షియం ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. పెరుగులోని ప్రోటీన్లు కూడా ఇందుకు సహాయం చేస్తాయి.
  • గర్భధారణ సమయంలో కలిగే ఎసిడిటీ, జీర్ణ సమస్యలను కూడా పెరుగు కంట్రోల్ చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి