WHO: ఆల్కహాల్ వినియోగం తగ్గాలంటే అదే ఏకైక మార్గం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త సిఫార్సు
ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో పాటు పలు స్వచ్ఛంధ సంస్థలు కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆల్కహాల్ వినియోగం తగ్గించడానికి ఎన్నో మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఆల్కహాల్, షుగర్ బేవరేజెస్‌పై...

ఆల్కహాల్ వినియోగం.. ఒక్క భారత్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య. మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా మందు బాబులు మాత్రం దానిని వదలడం లేదు. ఏటా వేలాది మంది మద్యం అలవాటు కారణంగా రోగాల బారిన పడుతుంటే, మరికొందరు మృతృవాత పడుతున్నారు కూడా. ఇక షుగర్ బేవరేజెస్ వల్ల కూడా పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో పాటు పలు స్వచ్ఛంధ సంస్థలు కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆల్కహాల్ వినియోగం తగ్గించడానికి ఎన్నో మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఆల్కహాల్, షుగర్ బేవరేజెస్‌పై పన్నులను పెంచడమే దీనికి పరిష్కారమని చెబుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు వీటిపై తక్కువ సుంకాన్ని విధిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. పలు దేశాల్లో వీటిపై విధిస్తున్న పన్నును పరిశీలించగా చాలా దేశాల్లో తక్కువ విధిస్తున్నారని తమ పరిశోధనలో తేలిందని తెలిపింది. ఆరోగ్య మానవాళిని పెంచేందుకు ఆల్కహాల్, తీపిపానియాలపై ఎక్కువ పన్ను వేయడమే ఉత్తతమైన మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఇందకుగాను తాజాగా డబ్ల్యూహెచ్‌వో ఆల్కహాల్ ట్యాక్స్ పాలసీ మాన్యువల్‌ను విడుదల చేసింది. లిక్కర్‌పై పన్నులు పెండం వల్ల దాని వినియోగాన్ని తగ్గించవచ్చని, దీంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యతో పాటు, మరణాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరాలను తగ్గించవచ్చని చెబుతున్నారు. ఆల్కహాల్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 26 లక్షల మంది చనిపోతున్నారని, ఇప్పుడు విధిస్తున్న సుంకానికి అధనంగా ఎక్కువ మొత్తంలో పన్ను వేయడం వల్ల గణనీయసంఖ్యలో మరణాలను తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.
ఇదే విషయమై.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమోషన్ డైరెక్టర్ రుడిగర్ క్రెచ్ మాట్లాడుతూ.. ‘అనారోగ్యానికి కారణమయ్యే ప్రొడక్ట్స్‌పై పన్ను పెంచడం వల్ల ప్రజల ఆరోగ్యాలు మెరుగవుతాయి. ఇది సమాజంపై ఒక సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తుంది. తద్వారా వ్యాధులు తగ్గడానికి, ప్రభుత్వాలకు ఆదాయం పెరిగి మరింత సేవ చేసేందుకు ఉపయోగపడుతుంది’ అని చెప్పుకొచ్చారు. అయితే మద్యంపై పన్నులు పెంచితే పేదలు మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని మద్యం తయారీ పరిశ్రమలు వాదిస్తున్నప్పటికీ, బలహీన సామాజిక వర్గాల్లో మద్యం వాడకం హానికరమనే విషయాన్ని మరిచి పోతున్నారని డబ్ల్యూహెచ్‌వో మాన్యువల్ తెలిపింది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..