Obesity: ఇండియాలో పెరుగుతున్న ఉబకాయులు.. లెటేస్ట్ సర్వేలో షాకింగ్ నిజాలు

|

Mar 01, 2024 | 7:35 PM

ప్రస్తుతం చాలామంది ఉబకాయం సమస్యతో బాధపడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. 1990 లో 0.4 మిలియన్లతో పోలిస్తే 2022 లో భారతదేశంలో 5 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలలో ఊబకాయం దాదాపు 12.5 మిలియన్లతో పెరిగిందని లాన్సెట్ జర్నల్ ప్రచురించిన రిపోర్ట్ లో వెల్లడించింది.

Obesity: ఇండియాలో పెరుగుతున్న ఉబకాయులు.. లెటేస్ట్ సర్వేలో షాకింగ్ నిజాలు
Childhood
Follow us on

ప్రస్తుతం చాలామంది ఉబకాయం సమస్యతో బాధపడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. 1990 లో 0.4 మిలియన్లతో పోలిస్తే 2022 లో భారతదేశంలో 5 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలలో ఊబకాయం దాదాపు 12.5 మిలియన్లతో పెరిగిందని లాన్సెట్ జర్నల్ ప్రచురించిన రిపోర్ట్ లో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో నివసిస్తున్న పిల్లలు, పెద్దల సంఖ్య మొత్తం ఒక బిలియన్ దాటింది.

గతంలో లాన్సెట్ విడుదల చేసిన రిపోర్ట్ లో వృద్ధులు, పట్టణాల్లో ఉండేవాళ్లు, ధనవంతులు అధికంగా చికెన్, మటన్ తీసుకోవడంతో ఈ సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా, సిక్కు మతాన్ని ఆచరించే వ్యక్తులలో పురుషులు, మహిళలు ఇద్దరిలో ఈ రేటు ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.

ఊబకాయంతో వచ్చే సమస్యలు

కార్డియోవాస్క్యులర్ డిసీజ్: అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు ఇన్సులిన్ నిరోధకత వంటి కారకాల వల్ల ఊబకాయం గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

టైప్ 2 డయాబెటిస్: టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందడానికి ఊబకాయం ఒక ప్రధాన ప్రమాద కారకం. ఎందుకంటే అధిక శరీర కొవ్వు ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.

కీళ్ల సమస్యలు: అధిక బరువు కీళ్ళపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితులకు దారితీస్తుంది. అంతేకాదు.. నొప్పి, శారీర చలనశీలతను తగ్గిస్తుంది.

స్లీప్ అప్నియా: స్లీప్ అప్నియాకు ఊబకాయం ఒక ప్రధాన కారణం. ఇది నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికరంగా ఉంటుంది. పగటి అలసట, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

కొన్ని క్యాన్సర్లు: రొమ్ము, పెద్దప్రేగు, ఎండోమెట్రియల్, మూత్రపిండాల క్యాన్సర్తో సహా కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదంతో ఊబకాయం ముడిపడి ఉంది.

శ్వాసకోశ సమస్యలు: ఊబకాయం ఊపిరితిత్తుల పనితీరును పరిమితం చేసి పరిస్థితులకు దారితీస్తుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, తగినంత శ్వాస లేకపోవడం వల్ల రక్తంలో తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, అధిక కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఏర్పడతాయి. ఇవి ప్రాణాంతక పరిస్థితులు

మానసిక ఆరోగ్య సమస్యలు: ఊబకాయం కారణంగా నిరాశ, ఆందోళన లాంటి లక్షణాలు ప్రభావం చూపి రోగాల బారిన పడేలా చేస్తాయి.