మీ కళ్లు, చర్మంలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్లీజ్ అలర్ట్.. మీకు ఈ ప్రమాదకర వ్యాధి ఉన్నట్లే

|

Apr 19, 2023 | 3:45 PM

Fatty Liver: మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయువమైన లివర్ విషయంలో మాత్రం అలా జరగదు. ఎందుకంటే లివర్ సగం కంటే ఎక్కువ డ్యామెజ్ అయిన తర్వాతే మనకు లక్షణాలు తెలుస్తాయి. ఆ సమయం నుంచే చికిత్స తీసుకోవడం ప్రారంభించాల్సి వస్తుంది.

మీ కళ్లు, చర్మంలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్లీజ్ అలర్ట్.. మీకు ఈ ప్రమాదకర వ్యాధి ఉన్నట్లే
Liver Health
Follow us on

మానవ శరీరంలో ప్రతి అవయువం దాని పరిధి మేరకు శరీర రక్షణకు ఉపయోగపడుతుంది. అయితే మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా కొన్ని రకాల వ్యాధులు ఇబ్బందిపెడుతుంటాయి. అయితే ఈ వ్యాధుల్లో అన్ని ప్రారంభ సమయంలోనే కొన్ని లక్షణాల వల్ల వాటిని గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకుంటాం. అయితే మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయువమైన లివర్ విషయంలో మాత్రం అలా జరగదు. ఎందుకంటే లివర్ సగం కంటే ఎక్కువ డ్యామెజ్ అయిన తర్వాతే మనకు లక్షణాలు తెలుస్తాయి. ఆ సమయం నుంచే చికిత్స తీసుకోవడం ప్రారంభించాల్సి వస్తుంది. ప్రపంచ లివర్ దినోత్సవం సందర్భంగా లివర్ సమస్యల గురించి ఓ సారి తెలుసుకుందాం. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డి) వంటి వ్యాధులు ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం 1990 నుంచి 2017 మధ్యకాలంలో కాలేయ క్యాన్సర్ కేసులు దాదాపు 100 శాతం పెరిగాయి. వీటిలో మూడింట రెండు వంతులు వైరల్ హెపటైటిస్‌కు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కాలేయ వ్యాధి తీవ్రంకాక ముందే కొన్ని లక్షణాల వల్ల వాటిని వెంటనే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాలేయ వ్యాధి ఉన్న వారికి చర్మం, కళ్లల్లో కలిగే మార్పులను బట్టి అంచనా వేయవచ్చు. 

కామెర్లు

కామెర్లు అని పిలిచే ఈ వ్యాధి కాలేయ సమస్య ఉన్నవారికి వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారి చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. కాలేయం రక్తం నుంచి బిల్‌రుబిన్‌ను శుద్ధి చేయలేకపోతే ఈ వ్యాధి వస్తుంది. పాత ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు బిల్‌రుబిన్ వ్యర్థ ఉత్పత్తిగా మారుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటే బిల్‌రుబిన్‌ను విచ్ఛిన్నమై, పిత్తంలో విసర్జిస్తుంది. 

స్పైడర్ ఆంజియోమాస్ 

స్పైడర్ ఆంజియోమాస్ అనేది ముఖం, మెడపై కనిపించే చిన్న, ఎర్రటి సాలీడు లాంటి రక్తనాళాలు. ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల ఇవి సంభవిస్తాయి. ఇది కాలేయ వ్యాధి ఉన్నవారిలో సర్వ సాధారణం. కాలేయం హార్మోన్ల జీవక్రియకు బాధ్యత వహిస్తుంది. అయితే అది దెబ్బతిన్నప్పుడు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

పామర్ ఎరిథీమా

పామర్ ఎరిథీమా ఉన్నవారి అరచేతులు ఎర్రగా మారతాయి. ఇది కాలేయ వ్యాధికి సంకేతం కావచ్చు. ఎందుకంటే ఇది అరచేతులకు రక్త ప్రవాహం పెరగడం వల్ల వస్తుంది. ముఖ్యంగా కాలేయంలో టాక్సిన్స్ ఏర్పడడం వల్ల ఈ పరిస్థితి వస్తుందని చాలా మంది వైద్యుల నమ్మకం.

కళ్ల కింద నల్లటి వలయాలు, మొటిమలు

కళ్ల కింద నల్లటి వలయాలు, మొటిమలు వస్తే కాలేయ వ్యాధికి సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే అవి తరచుగా పేలవమైన కాలేయ పనితీరు వల్ల సంభవిస్తాయి. రక్తం నుంచి వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. అలా చేయలేనప్పుడు, అది శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి దారితీస్తుంది. దీంతో కళ్ల కింద నల్లటి వలయాలు, అలసట, బలహీనత వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి.

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.