Body Pain Relief Tips: చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!

| Edited By: Ravi Kiran

Dec 08, 2023 | 10:00 PM

చలి కాలం వచ్చిందంటే సాధారణంగా ఎవరికైనా ఒళ్లు నొప్పులు అనేవి వస్తూంటాయి. భుజాల నొప్పులు, మెడ నొప్పి, కాళ్ల నొప్పులు, కీల్ల నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చలి కాలంలో ఎవరికైనా సహజంగా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ నొప్పులను భరించలేక చాలా మంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇలా ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చలి కాలంలో ఈ నొప్పుల నుంచి బయట పడేందుకు కొన్ని రకాల ఇంటి చిట్కాలు..

Body Pain Relief Tips: చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
Body Pains
Follow us on

చలి కాలం వచ్చిందంటే సాధారణంగా ఎవరికైనా ఒళ్లు నొప్పులు అనేవి వస్తూంటాయి. భుజాల నొప్పులు, మెడ నొప్పి, కాళ్ల నొప్పులు, కీల్ల నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చలి కాలంలో ఎవరికైనా సహజంగా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ నొప్పులను భరించలేక చాలా మంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇలా ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చలి కాలంలో ఈ నొప్పుల నుంచి బయట పడేందుకు కొన్ని రకాల ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటి ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్:

విపరాతంగా ఒళ్లు నొప్పులు వస్తూ ఉంటే మాత్రం.. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి యాపిల్ సైడర్ వెనిగర్ బాగా హెల్ప్ చేస్తుంది.ఒక బకెట్ వేడి నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ ను వేసి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఒళ్లు నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

అల్లం:

అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం నొప్పుల నుంచి బయట పడటానికి ఉపయోగ పడుతుంది. కొద్దిగా అల్లాన్ని మిక్సీ పట్టి.. ఓ క్లాత్ లో కట్టి దాన్ని కొన్ని నిమిషాల పాటు వేడి నీటిలో మరిగించాలి. ఇలా చేస్తే అల్లం రసం.. నీటిలోకి బాగా దిగుతుంది. ఈ నీటిని నొప్పులు ఉన్న చోట రాయాలి. ఓ 15 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మాత్రం నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

పసుపు:

పసుపులో కూడా యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, కండరాలు బలంగా ఉండటానికి బాగా సహాయ పడుతుంది. శరీరంలో నొప్పులు ఉన్న చోట పసుపు పేస్టును పూస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

దాల్చిన చెక్క:

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో కూడా దాల్చిన చెక్క పొడిని కూడా వేసి మరిగించి తాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా శరీరంలో ఎక్కడైనా నొప్పి వేధిస్తూ ఉంటే ఆవాల ఆయిల్ వేడి చేసి.. మర్దనా చేసుకుంటే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.