
చలువ చేస్తుందని, ఆరోగ్యానికి మంచిదని మజ్జిగను అతిగా తాగుతూంటారు. మజ్జిగ తాగడం ఆరోగ్యానికి మంచిదే. వేడి చేయకుండా శరీరాన్ని చల్ల బరిచే తత్వం మజ్జిగకు ఉంది. మజ్జిగలో జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఇంకా మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. అలాగే కొంత మంది మజ్జిగలో కొత్తి మీర, పుదీనా లేదా కరివేపాకు, జీలకర్ర లాంటివి వేసుకుని తాగుతారు. ఎలా తాగినా మజ్జిగ మంచిదే. ఆయుర్వేదంలో కూడా మజ్జిగ ప్రస్తావన ఉంది. మజ్జిగ తాగితే కొన్ని రకాల సమస్యలను దూరం పెట్టవచ్చు. కానీ మంచిదని అదే పనిగా మజ్జిగ తాగితే మాత్రం పలు అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం చాలా మందికి తెలీదు. మంచిదని పూట పూటకి గ్లాసులు గ్లాసులు తాగేస్తూంటారు. మజ్జిగ తాగడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయి. అయితే అవి మజ్జిగ వల్ల అనుకోరు.
అజీర్తి వస్తుంది:
సాధారణంగా పాలతో తయారు చేసిన ఏ పదార్థాల్లో అయినా లాక్టోజ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆహారాన్ని అరుగుదల చేసే శక్తిని అందరికీ ఇవ్వదు. కొంత మందికి ఈ లాక్టోజ్ ను అరిగించుకునే ఎంజైమ్స్ తగిన మోతాదులో రిలీజ్ కావు. దీంతో కడుపులో నొప్పి, పొట్ట ఉబ్బరంగా ఉండటం, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలు ఎదరవుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య ఉంటుంది. అలాగే కొంత మందికి మిల్క్ లోని ప్రోటీన్లు పడవు. ఈ క్రమంలో మజ్జిగ తాగినా కూడా కొంత మందికి స్కిన్ పై దద్దర్లు, దురద వంటికి వస్తాయి. కాబట్టి అలాంటి వారు మజ్జిగను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.
క్యాలరీలు తక్కువని తాగుతూంటారు:
మజ్జిగలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు మజ్జిగపై ఫోకస్ చేసి, ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల కూడా తప్పు అని నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల నీరసం, అలసట, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయట. మజ్జిగ చలువ చేసే పదార్థా కాబట్టి ఎక్కవగా తీసుకున్నా జబులు చేస్తుంది.
చక్కెర లేని మజ్జిగ తాగాలి:
చాలా మంది మజ్జిగలో షుగర్ కలుపుకుని తాగుతూంటారు. దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదంటున్నారు ఆహార నిపుణులు. చక్కెర లేని మజ్జిగ తాగడమే ఉత్తమని చెబుతున్నారు.
ఉప్పు తక్కువగా వేసుకోవాలి:
మజ్జిగ తాగేవారు ఉప్పును చాలా తక్కువగా వేసుకొని సేవించాలి. లేదంటే బీపీ వచ్చే అవకాశం ఉంది.
ఎలా తాగాలి:
సాధారణంగా మజ్జిగను రోజూ ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది. మూడు పూటలూ తాగాల్సిన పని లేదు. డాక్టర్లు సూచిస్తేనే ఎక్కువ మోతాదులో తాగాలని చెబుతున్నారు. అలాగే వేసవి కాలంలో రెండు గ్లాసుల కంటే ఎక్కువగా మజ్జిగ తాగకూడదు. వానాకాలం, చలి కాలంలో చిన్న గ్లాస్ మజ్జిగ తీసుకుంటే సరిపోతుందని సూచించారు. లేదంటే ఊపిరి తిత్తుల్లో నిమ్ము చేరే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.