ఇప్పుడంటే అంతా ఫ్యాషన్ అయింది కానీ.. పూర్వం అయితే పెద్దలు ఎక్కువగా గంజినే తాగేవారు. క్రమం తప్పకుండా ప్రతి రోజూ గంజి తాగడం కానీ.. గంజి అన్నం తినడం కానీ చేసేవారు. అప్పట్లో టిఫిన్లు అలాంటివేమీ ఉండేవి కాదు. కేవంల గంజి అన్నం తిని.. పనులకు వెళ్లేవారు. ఆయుర్వేదంలో కూడా గంజికి మంచి ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు గ్రామాల్లో కూడా దీన్ని తాగడం తగ్గించేశారు. అన్నం వండుకునే పద్దతుల్లో మార్పులు రావడంలో.. గంజి దొరకడమే కష్టంగా మారింది. గంజిలో ప్రోటీన్లు, క్యాల్షియం, జింక్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల కేవలం ఆరోగ్యమే కాకుండా.. చక్కటి అందం కూడా సొంతం అవుతుంది. ఇలాంటి గంజితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
* ప్రతి రోజూ వ్యాయామాలు చేసేవారు ప్రోటీన్ షేక్స్ కన్నా.. ఒక గ్లాసుడు గంజి తాగడం మంచింది. దీని వల్ల శరీరం స్ట్రాంగ్ గా తయారవుతుంది. అదే విధంగా కండలు కూడా పెరిగేలా చేస్తుంది.
* బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా చూస్తుంది.
* రక్త పోటుతో బాధ పడేవారు గంజి తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్లు, ఫైటో కెమికల్స్, మెగ్నీషియం, పోటాషియం వంటివి బీపీని అదుపులో ఉంచుతాయి.
* విరేచనాలు, వాంతులు అయ్యే వాళ్లు గంజి తాగడం మంచిది. ఇది శరీరంలో కోల్పోయిన పోషకాలను తిరిగి అందిస్తుంది.
* చర్మం కాంతి వంతంగా తయారవ్వాలంటే ప్రతి రోజూ గంజి తాగాలి. గంజిలో ఇనోసెటాల్ అనేది అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లినప్పుడు స్కిన్ గ్లోగా మారడమే కాకుండా.. జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. జుట్టు, చర్మం రెండూ మెరుస్తూ ఉంటాయి.
* గంజి తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయి. దీంతో మానసిక ప్రశాంత, శారీరక ప్రశాంతత కూడా లభిస్తుంది.
*అదే విధంగా ఉదర సమస్యలను కూడా తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. మల బద్ధకంతో ఇబ్బంది పడేవారు గంజి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గోరు వెచ్చని గంజి తాగితే ఇంకా మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.