Pregnancy: అమ్మతనంలో ఆ సమస్యలు వెంటాడుతున్నాయా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..

|

Aug 19, 2022 | 5:36 PM

గర్భం దాల్చిన తర్వాత వారి శరీరంలో బలహీనత.. హార్మోన్ల మార్పులు, గ్యాస్, బరువు, కడుపు నొప్పి వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీల శరీరంలో వచ్చే చాలా సమస్యలు..

Pregnancy: అమ్మతనంలో ఆ సమస్యలు వెంటాడుతున్నాయా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..
Pregnancy
Follow us on

తల్లి కావడం అనేది మహిళలకు అతి పెద్ద వరం. అయితే ఈ సమయంలో స్త్రీల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. గర్భం దాల్చిన తర్వాత వారి శరీరంలో బలహీనత.. హార్మోన్ల మార్పులు, గ్యాస్, బరువు, కడుపు నొప్పి వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీల శరీరంలో వచ్చే చాలా సమస్యలు హార్మోన్ల మార్పుల వల్ల.. లైఫ్ స్టైల్, ఈటింగ్ డిజార్డర్స్ కారణంగా గర్భధారణ సమయంలో మహిళలు ఎక్కువగా ఆందోళనకు గురవుతారు. గర్భధారణ సమయంలో, స్త్రీలలో జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మహిళలు విశ్రాంతి లేకుండా ఉంటారు. గర్భం దాల్చిన ఆరో నెలలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. 

అయితే ఈ వ్యాధిని కొన్ని సరైన జీవనశైలితో మార్పులు చేసుకోవచ్చు. కొన్ని హోం రెమెడీస్ తీసుకోవడం ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గర్భధారణ సమయంలో ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని ప్రసూతి నిపుణులు అంటున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎసిడిటీ రాకుండా ఉండేందుకు ఎలాంటి హోం రెమెడీస్ తీసుకోవాలో తెలుసుకుందాం.

అసిడిటీని నివారించడానికి ఇలా చేయండి..

నిమ్మరసం తాగండి:

గ్యాస్, అసిడిటీతో ఇబ్బంది పడుతుంటే ఆహారంలో నిమ్మరసం తీసుకోండి. ఒక గ్లాసు నీళ్లలో కొంత నిమ్మరసం తీసుకోండి. నిమ్మరసం కడుపులో జీర్ణ రసాలు, పైత్య ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కడుపులో ఆమ్లాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆహారంలో పెరుగు తప్పనిసరి:

గర్భధారణ సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల అసిడిటీని దూరం చేయడంతోపాటు శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకుంటే తల్లి, బిడ్డ మంచి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. గర్భధారణ సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణక్రియతోపాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

కొబ్బరి నీళ్లు తాగండి:

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎసిడిటీ, గ్యాస్‌తో ఇబ్బంది పడుతుంటే కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ మరియు పొటాషియం వంటి ఆల్కలీన్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల pH స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది మరియు ఎసిడిటీ మరియు గ్యాస్ నుండి బయటపడుతుంది. కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.

అల్పాహారంలో నానబెట్టిన బాదంపప్పు తినండి:

గర్భధారణ సమయంలో, మహిళలు మొదటి నెల నుంచి చివరి నెల వరకు బాదం తినవచ్చు. మీరు నానబెట్టిన బాదంపప్పులను ఉదయం, సాయంత్రం రెండు పూటలా తినవచ్చు. గర్భధారణ సమయంలో పరిమిత పరిమాణంలో బాదంపప్పు తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందని గుర్తుంచుకోండి.

నిటారుగా కూర్చొని తినండి:

ప్రెగ్నెన్సీలో గ్యాస్, ఎసిడిటీ రాకుండా ఉండాలంటే నేరుగా కూర్చొని ఆహారాన్ని తినండి. మీరు అల్పాహారం, చిరుతిండ్లు తిన్న సమంయలో కూడా పొట్టపై ఎలాంటి బరువు పడకుండా నిటారుగా కూర్చుని తినండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం