Chest Pain Risks: శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి ఉన్నా.. అసౌకర్యంగా ఉన్నా అది ఏదో ఒక వ్యాధికి సంకేతం. అలాంటి వాటిని అస్సలు విస్మరించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఎక్కువ మంది ఛాతీ భాగంలో అసౌకర్యంగా లేదా నొప్పితో బాధపడుతుంటారు. ఛాతీ నొప్పిని చాలా మంది సర్వ సాధారణమైనదిగా విస్మరిస్తుంటారు. ఇది క్రమంగా ప్రాణాంతకం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఛాతీ నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీ నొప్పి వెనుక కారణం ఏమిటి.. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఛాతీలో నొప్పి ఉంటే, ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం..
ఆంజినాః ఆంజినా (Angina) అనేది ఛాతీలో నొప్పి లాంటిది. ఇది గుండె జబ్బులకు సంకేతం కావచ్చు. ఆంజినా నొప్పిలో.. సాధారణ ఛాతీ నొప్పి కంటే ఎక్కువ నొప్పి వస్తుంది. మరోవైపు గుండెకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ఆంజినా సమస్య ఉండవచ్చు, ఆంజినా సమస్య రెండు రకాలు.. స్టేబుల్ ఆంజినా.. అస్థిర ఆంజినా. గుండె చాలా వేగంగా రక్తాన్ని పంప్ చేసినప్పుడు స్థిరమైన ఆంజినా ఏర్పడుతుంది.అస్థిరమైన ఆంజినాలో గుండె రక్తాన్ని పంపింగ్ చేయడంలో సమస్య ఏర్పడుతుంది. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది.
గుండెపోటుః గుండెపోటుకు ముందు ఛాతీలో తీవ్రమైన నొప్పి సమస్య ఏర్పడుతుంది. ఇది కాకుండా ఛాతీ నొప్పిని గుండెపోటు లక్షణంగా పరిగణిస్తారు. అందువల్ల ఆకస్మిక ఛాతీ నొప్పిని ఎప్పుడూ సాధారణమైనదిగా తీసుకోకూడదు. ఎందుకంటే గుండెపోటు సమస్యకు ముందు ఇలాంటి సంకేతాలు, సమస్యలు ఉండవచ్చు.
గుండె ఇన్ఫెక్షన్ కారణంగా ఛాతీ నొప్పిః గుండె ఇన్ఫెక్షన్ ఉన్న రోగులు ఛాతీ నొప్పిని అనుభవించవచ్చు. గుండె వైరల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తరచుగా మయోకార్డిటిస్ వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ సమస్యలలో గుండె కండరాలు ఎర్రబడతాయి. దీని కారణంగా ఛాతీలో ఎక్కువగా నొప్పి ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఛాతీ నొప్పి సమస్యను విస్మరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి