తల, మెడ, వెన్ను భాగంలో దీర్ఘకాలిక నొప్పులున్నాయా..! అయితే ఇవి ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు..

|

Nov 27, 2021 | 10:35 PM

Neurological: ఆధునిక జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదు. గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేస్తున్నారు. ఈ కారణంగా మెడ, వెన్ను నొప్పి కొనసాగుతుంది.

తల, మెడ, వెన్ను భాగంలో దీర్ఘకాలిక నొప్పులున్నాయా..! అయితే ఇవి ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు..
Mental Health
Follow us on

Neurological: ఆధునిక జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదు. గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేస్తున్నారు. ఈ కారణంగా మెడ, వెన్ను నొప్పి కొనసాగుతుంది. ఈ సమస్య ఎముకలకు సంబంధించిన వ్యాధికి సంకేతం. కానీ దీంతో పాటు నిరంతర తలనొప్పి, శరీర భాగాలలో కొన్ని మార్పులు ఉన్నట్లయితే అది నాడీ సంబంధిత రుగ్మతకు నాంది కావచ్చు. కాబట్టి అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే న్యూరోకు సంబంధించిన ఏదైనా వ్యాధికి తక్షణ చికిత్స అవసరం.

వైద్యుల ప్రకారం.. న్యూరోలాజికల్ డిజార్డర్ కారణంగా మన శరీరంలో అనేక రకాల సమస్యలు ఏకకాలంలో సంభవిస్తాయి. నాడీ సంబంధిత సమస్యలు సాధారణంగా కొన్ని వైరల్ లేదా ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. న్యూరోకి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురవుతారు. వీటిలో శరీరంలోని ఏదైనా భాగంలో పక్షవాతంతో పాటు బ్రెయిన్ స్ట్రోక్, జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. అంతే కాకుండా డిమెన్షియా, ఎపిలెప్సీ, బ్రెయిన్ ట్యూమర్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా వస్తాయి.

ఒక వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకున్నట్లయితే లేదా అతని ముఖం ఆకృతిలో స్వల్ప మార్పు కనిపిస్తే అతడికి న్యూరో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ సమస్య వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావొచ్చు. చాలా స్ట్రోక్ కేసులలో రోగి ఆసుపత్రికి ఆలస్యంగా చేరుకోవడం వల్ల మరణిస్తాడు. దీనికి కారణం ప్రజలు నరాల సంబంధిత రుగ్మతల ప్రారంభ లక్షణాలపై శ్రద్ధ చూపకపోవడమే. సాధారణంగా ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మందులు తీసుకుంటారు కానీ న్యూరో సమస్య వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే చాలా పరిణామాలు ఎదుర్రోవాల్సి ఉంటుంది.

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?