Idly: అమ్మా రోజు ఇడ్లీ ఏంటి అంటున్నారా..? అసలు ఈ బెనిఫిట్స్ మీకు తెల్సా..?
మనిషికి కావాల్సిన ప్రొటీన్లు, ఫైబర్లు ఇడ్లీ ద్వారా శరీరానికి అందుతాయి. ఇడ్లీని పులియబెట్టిన ఆహారంగా పరిగణిస్తారు. ఇది పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పులియబెట్టిన ఆహారం గట్‌లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. వాపు లక్షణాలను తగ్గిస్తుంది.

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అల్పాహారం ఇడ్లీ. ఈజీగా అరిగే టిఫిన్ కూడా ఇదే. అందుకే ఇడ్లీ తిన్న రోజు మనకు త్వరగా ఆకలి వేస్తుంది. మినప పప్పు, బియ్యం మిశ్రమంతో చేసే ఇడ్లీలను మన ప్రాంతంలో ఎక్కువగా తింటూ ఉంటారు. ఇడ్లీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఒక ఇడ్లీలో 33 కేలరీలు మాత్రమే ఉంటాయి. అయితే ఇడ్లీలు తెల్లగా ఉండాలని పొట్టు తీసిన మినప పప్పు వినియోగాస్తారు. అలానే తెల్లటి బియ్యపు రవ్వ వాడతారు. ఇలా చేయడం వల్ల ఆ ధాన్యాల్లోని పోషకాల్ని కొంతమేర నష్టపోతాం. ఇడ్లీ తయారి కోసం బియ్యపు రవ్వ కాకుండా బ్రౌన్ రైస్ వాడితే బి విటమిన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందుతాయి.
- ఇడ్లీ కార్బోహైడ్రేట్లకు బెస్ట్ సోర్స్. ఇది రోజువారీ కార్యకలాపాలకు శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇతర అల్పాహార ఎంపికలతో పోలిస్తే ఇడ్లీలో కేలరీలు చాలా తక్కువ. బరువు తగ్గడానికి ఇది సరైన ఆహారం.
- ఇడ్లీని పులియబెట్టిన బియ్యం పిండితో తయారు చేస్తారు. ఇది కండరాల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తుంది.
- ఇడ్లీని పులియబెట్టడం వల్ల విటమిన్ బి లభ్యత పెరుగుతుంది.
- ఇడ్లీలో సహజంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది గుండె-ఆరోగ్యకరమైన ఎంపిక.
- ఇడ్లీల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
- ఇడ్లీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. గుండె, లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి
- కావాల్సిన అమైనో యాసిడ్స్ సులభంగా అందుతాయి.
- జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది.
- ఇక ఇడ్లీ తయారీకి నూనె అవసరం లేదు. ఈ రకంగానూ ప్రయోజనమే.
- ఇడ్లీలో పీచుపదార్థం ఉండనప్పటికీ, దీనిని తరచుగా చట్నీలు లేదా సాంబార్‌లతో తింటారు. సో ఆ మార్గాన పీచు పదార్థం అందుతుంది.
- ఇడ్లీ సాధారణంగా గ్లూటెన్ రహిత ఆహారం. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. )




