Hypothyroid: ప్రస్తుతం మధుమేహంలాగే ప్రపంచ వ్యాప్తంగా థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. థైరాయిడ్ కూడా చాలా మందిని వెంటాడుతోంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపో (Hypothyroid), రెండోది హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism). ఇందులో ఏది వచ్చినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని ఆహారాలను తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హైపో థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారాలు ఏమిటో చూద్దాం.
హైపో థైరాయిడ్ లక్షణాలు:
► బరువు పెరగడం
► చర్మం పొడిగా మారడం
► జుట్టు రాలడం
► గుండె నెమ్మదిగా కొట్టుకోవడం
► శరీరంలో అధిక చెడు కొలెస్ట్రాల్ పెరగడం
► ముఖం వాపులు
► కండరాల అసౌకర్యం, మలబద్దకం
హైపర్ థైరాయిడిజం లక్షణాలు:
► బరువు తగ్గడం
► గుండే వేగంగా కొట్టుకోవడం
► ఆందోళన కలుగడం
► చిరాకు అనిపించడం
► నిద్ర సరిగ్గా రాకపోవడం
► ఏకాగ్రతతో ఇబ్బంది పడటం
► ఆకలి పెరగడం
►తేమగా ఉండే చర్మంతో సమస్యలకు దారి తీయడం
చేపలు:
చేపల్లో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు హైపో థైరాయిడ్ సమస్యతో ఇబ్బందులు పడేవారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇవి వాపులు తగ్గిస్తాయి. థైరాయిడ్, నాడీ మండల వ్యవస్థలను సక్రమంగా పని చేసేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. పాలు, పాలకు సంబంధించినవి తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో థైరాయిడ్ గ్రంథులు సక్రమంగా పని చేస్తాయి.
ఫైబర్:
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం బెటర్. శరీరానికి 30 నుంచి 40 గ్రాముల వరకు ఫైబర్ అందేలా చూసుకుంటే హైపో థైరాయిడ్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
మొలకెత్తిన విత్తనాలు:
థైరాయిడ్‌తో బాధపడేవారు మొలకెత్తిన అవిసె గింజలు, చియా సీడ్స్‌ను తీసుకోవడం ఉత్తమం. ఇవి శరీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పని చేస్తుంది.
కొబ్బరినూనె:
థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారిలో మెటబాలిజం క్రమబద్దంగా ఉండదు. దీంతో ఒకేసారి బరువు పెరగడమో లేదా అకస్మాత్తుగా బరువు తగ్గడం జరుగుతుంది. అయితే కొబ్బరినూనెను నిత్యం తీసుకుంటే అందులో ఉండే మీడియం-చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. అలసట అనేది తగ్గుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. వాపులు తగ్గుముఖం పడతాయి. దీంతో హైపో థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు.
(గమనిక: అందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)
ఇవి కూడా చదవండి: