Corona Second Wave : కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలను గుర్తించడం ద్వారా రోగిని కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్–19 ప్రారంభంలో చాలామందికి తీవ్రమైన జ్వరం వస్తుందని ఫిర్యాదు చేశారు. కానీ చాలా సందర్భాల్లో జ్వరం లేకపోయినా పాజిటివ్‌గా తేలుతుంది. అటువంటి సమయంలోకనుక మీకు ఈ లక్షణాలు ఉంటే కొవిడ్ అని గుర్తించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. లేత ఎర్రటి కళ్ళు – చైనాలో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసులలో కొన్ని నిర్దిష్ట లక్షణాలు గుర్తించబడ్డాయి. ఒక వ్యక్తి కళ్ళు లేత ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారవచ్చు. కళ్ళు ఎర్రబడటమే కాకుండా, వాపు, కళ్ళ నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఉండవచ్చు.
2. దీర్ఘకాలిక దగ్గు – దీర్ఘకాలిక దగ్గు కూడా కరోనా లక్షణాల్లో ఒకటి. అయితే ధూమపానం వల్ల వచ్చే దగ్గు అలాగే వైరల్ ఫ్లూ వల్ల వచ్చే దగ్గు గుర్తించడం చాలా కష్టం. నిరంతంరం దగ్గు ఉంటే మాత్రం కచ్చితంగా కరోనగానే పరిగణించాలి.
3. ఊపిరి – కరోనా రెండో వేవ్‌లో చాలా మంది రోగులు ఊపిరి తీసుకోలేరు. అటువంటి పరిస్థితిలో ఆస్తమాతో బాధపడుతున్న రోగులపై శ్రద్ధ చూపడం అవసరం. మీకు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటే, వెంటనే ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్‌ను తనిఖీ చేసి 94 కన్నా తక్కువ ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
4. ఛాతీ నొప్పి – ఛాతీ నొప్పి కరోనా ప్రాణాంతక లక్షణంగా పరిగణించబడుతుంది. ఇలాంటి రోగులను చాలా మంది ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. మీకు కూడా ఛాతీ నొప్పి అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.
5. రుచి వాసన కోల్పోవడం – వాసన, రుచి కోల్పోవడం రెండూ కోవిడ్ -19 అసాధారణ లక్షణాలు. శరీరంలో జ్వరం ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఒకే లక్షణంగా ఉద్భవించి శరీరంలో ఎక్కువసేపు ఉంటాయి. కోలుకున్న తర్వాత కూడా ఈ లక్షణాలు ఉంటాయి.
6. కండరాలు, కీళ్ల నొప్పులు – కరోనా రోగులలో ముఖ్యంగా వృద్ధులలో కండరాలు, కీళ్ల నొప్పుల గురించి ఫిర్యాదు చేయడం కనిపిస్తుంది. ఒక నివేదిక ప్రకారం.. వైరస్ కణజాలం కణాలపై దాడి చేసినప్పుడు కండరాల నొప్పి వస్తుంది. అయితే ఈ లక్షణాలు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిలో మాత్రమే కనిపిస్తాయి.
Read more: Steam Inhalation: కరోనా కోసం అతిగా ఆవిరి పడితే ప్రమాదమే.. ముక్కు దిబ్బడ కోసమే పట్టాలి..!
Dead Bodies In Rivers: మృతదేహాలు కొట్టుకు వచ్చిన నీటితో కరోనా వస్తుందా..? క్లారిటీ ఇచ్చిన నిపుణులు