AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constipation Relief: పొద్దున్నే కడుపు క్లీన్ అవ్వడం లేదా?.. రాత్రిపూట ఒక్కగ్లాసు ఇది తాగితే మలబద్ధకం మాయం!

ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, జంక్ ఫుడ్స్ విపరీతంగా తినడం, పీచు పదార్థాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల చాలా మందిని వేధించే అతిపెద్ద సమస్య 'మలబద్ధకం'. దీనిని చాలా మంది సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీర్ఘకాలిక మలబద్ధకం అనేది పైల్స్, ఫిస్టులా, గ్యాస్  కడుపు ఉబ్బరం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Constipation Relief: పొద్దున్నే కడుపు క్లీన్ అవ్వడం లేదా?.. రాత్రిపూట ఒక్కగ్లాసు ఇది తాగితే మలబద్ధకం మాయం!
Home Remedies For Constipation Relief
Bhavani
|

Updated on: Jul 17, 2026 | 7:58 PM

Share

ఉదయాన్నే విరేచనం సరిగ్గా కాకపోతే రోజంతా నీరసంగా, అసౌకర్యంగా ఉంటుంది. లూజ్ మోషన్స్ కోసం మార్కెట్లో దొరికే ఇంగ్లీష్ మందులను తరచూ వాడటం వల్ల ప్రేగుల పనితీరు దెబ్బతింటుంది. అయితే, మన ఇంట్లోనే లభించే కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మలబద్ధకం సమస్య నుండి ఎలా త్వరగా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం.

1. గోరువెచ్చని నీరు, నిమ్మరసం

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం పిండుకుని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఇది ప్రేగుల కదలికలను వేగవంతం చేసి, మలాన్ని సులభంగా బయటకు పంపడానికి సహాయపడుతుంది.

2. త్రిఫల చూర్ణం ఆయుర్వేద ఔషధం

ఆయుర్వేదంలో మలబద్ధకానికి త్రిఫల చూర్ణం అత్యుత్తమ నివారణగా చెప్పబడింది. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల కలయికతో తయారయ్యే ఈ చూర్ణం ప్రేగులను శుభ్రపరుస్తుంది.

ఎలా వాడాలి?: రాత్రి పడుకునే ముందు ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. ఇది మరుసటి రోజు ఉదయం పొట్టను పూర్తిగా శుభ్రం చేస్తుంది.

3. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం:

ఆహారంలో ఫైబర్ లోపించడం వల్లే మలం గట్టిపడుతుంది. కాబట్టి రోజువారీ డైట్‌లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు (ముఖ్యంగా బొప్పాయి, జామ, అరటిపండు), మరియు నానబెట్టిన అంజీర, ఎండుద్రాక్షలను చేర్చుకోవాలి. ఇవి మలాన్ని మృదువుగా మార్చుతాయి.

4. ఆముదం నూనె

పూర్వకాలం నుండి మలబద్ధకానికి ఆముదాన్ని సహజ లాక్సేటివ్‌గా ఉపయోగిస్తున్నారు.

ఎలా వాడాలి?: రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒకటి లేదా రెండు స్పూన్ల శుద్ధమైన ఆముదం నూనె వేసి తాగడం వల్ల ఉదయానికి విరేచనం సులభంగా అవుతుంది. (గమనిక: గర్భిణీలు దీనిని వాడకూడదు).

5. తగినంత నీరు తాగడం, వ్యాయామం:

రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అలాగే, రోజూ కనీసం 20-30 నిమిషాల పాటు నడక లేదా యోగాసనాలు వేయడం వల్ల ప్రేగులలో కదలికలు మెరుగవుతాయి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు వివిధ ఆరోగ్య నివేదికలు, సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులు మరియు నిపుణుల సలహాల ప్రాతిపదికన అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి, దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య ఉన్నవారు సొంత వైద్యం చేసుకోకుండా అర్హులైన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.

Follow Us