Thyroid in Child: పిల్లల్లో థైరాయిడ్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి?

థైరాయిడ్ సమస్య కేవలం పెద్దల్లో మాత్రమే వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే. పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపిస్తుంది. అయితే ఇటువంటి సమస్య పిల్లలో చాలా అరుదుగా కనిపిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ పిల్లల ఎదుగుదలలో సహాయ పడుతుంది. పిల్లలు పెరుగుతున్న సమయంలో ఈ హార్మోనో ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు. అయితే థైరాయిడ్ సమస్యను ముందుగానే గుర్తించి.. చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో థైరాయిడ్ లక్షణాలు..

Thyroid in Child: పిల్లల్లో థైరాయిడ్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి?
Thyroid

Updated on: Jan 20, 2024 | 1:24 PM

థైరాయిడ్ సమస్య కేవలం పెద్దల్లో మాత్రమే వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే. పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపిస్తుంది. అయితే ఇటువంటి సమస్య పిల్లలో చాలా అరుదుగా కనిపిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ పిల్లల ఎదుగుదలలో సహాయ పడుతుంది. పిల్లలు పెరుగుతున్న సమయంలో ఈ హార్మోనో ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు. అయితే థైరాయిడ్ సమస్యను ముందుగానే గుర్తించి.. చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.

హైపో థైరాయిడిజం పిల్లల్లో ఉంటే..

థైరాయిడ్‌లో రెండు రాకాలు ఉంటాయి హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. తక్కువ హార్మోన్లని ఉత్పత్తి చేస్తే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఇది నవజాత శిశుల్లో కనిపించే సాధారణమైన సమస్య. పిల్లల్లో ఈ సమస్య వస్తే.. మల బద్ధకం, శక్తి తగ్గి పోవడం, పొడి చర్మం, అలసట, చలిగా అనిపించడం, కండరాల నొప్పులు వంటివి కనిపిస్తాయి.

హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఉంటే..

అదే పిల్లలో హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఉంటే.. విపరీతమైన ఆకలి, బరువు తగ్గడం, నిద్ర సమస్యలు, తట్టుకోలేనంత చలి, కండరాలు బలహీనంగా ఉండలి, అతి సారం, అధిక చెమట పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఏకాగ్రతలో ఇబ్బంది, నిద్ర సమస్యలు వంటివి కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే మీరు వైద్యుని వద్దకు తీసుకెళ్లడం మంచిది. పిల్లల పరిస్థితిని బట్టి వైద్యులు థైరాయిడ్ స్థాయిలను చెక్ చేస్తారు. టెస్టుల ద్వారా వాటిని నిర్థారణ చేస్తారు. అయితే ఆహారాల ద్వారా థైరాయిడ్‌ సమస్యను కొంత మేర తగ్గించుకోవచ్చు. పిల్లల్లో తేడాలను మొదట్లోనే గుర్తిస్తే చికిత్స త్వరగా అందించవచ్చు. ఆలస్యం చేస్తే.. సమస్య పెరిగి శరీరంలో అనేక మార్పులు చేటు చేసుకుంటాయి. పిల్లల్లో వచ్చే మార్పులను అప్పుడప్పుడూ గమనించడం మంచిది.

ఈ ఆహారం తీసుకోవాలి..

థైరాయిడ్ సమస్యలు ఉన్న పిల్లలకు అయోడిన్, కాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారాలను ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే యాపిల్, ఆరెంజ్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్, పైనాపిల్, బెర్రీలు, వాల్ నట్స్, చేపలు, గుడ్లు వంటి ఆహారాలు ఇవ్వడం వల్ల కొంత మేర థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌ని అదుపు చేయవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.