Home Remedies For Cough: వేసవి కాలం ముగుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే తొలకరి పులకరిస్తోంది. పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే సీజనల్ మార్పులతో చాలామందిలో ఉన్నట్లుండి జలుబు, దగ్గు సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా జలుబు ఒక పట్టాన వదలదు. ఒక్కోసారి ఎన్ని మందులు వేసుకున్నా రోజుల తరబడి వేధిస్తుంది. ఈనేపథ్యంలో జలుబు, దగ్గును వదిలించుకోవడానికి వంటగదిలో ఉన్న పదార్థాలను ఉపయోగించవచ్చు. పైగా ఈ హోం రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తేనె, నిమ్మ, పసుపు, అల్లం తదితర పదార్థాలు జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. మరి వర్షాకాలం వ్యాధుల నుంచి దూరంగా ఉండేందుకు ఎలాంటి హోం రెమెడీస్ ట్రై చేయచ్చో ఒకసారి తెలుసుకుందాం రండి.
వేడి సూప్‌లు, టీలతో..
వేడి వేడి సూప్‌లు తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకు గాను వివిధ రకాల కూరగాయలతో మనం ఈజీగా సూప్‌లు తయారుచేసుకోవచ్చు. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. వర్షాకాలంలో చికెన్ సూప్ కూడా ట్రై చేయవచ్చు. జలుబు, ఫ్లూ లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి చికెన్ సూప్ చాలా మంచిది. ఇది గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
బ్లాక్ పెప్పర్ టీ
నల్ల మిరియాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తాయి. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జలుబు, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం ఒక కప్పు టీలో నల్ల మిరియాలు, చిటికెడు ఉప్పు కలిపి తీసుకోండి. ఇది కఫం, శ్లేష్మం, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇతర ఆహార పదార్థాల్లో కూడా నల్ల మిరియాలను చేర్చుకోవచ్చు.
పసుపు పాలు
జలుబు, దగ్గు నుండి బయటపడటానికి గోరువెచ్చని పాలలో కాసింత పసుపు కలిపి తీసుకోవచ్చు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది పొడి దగ్గును నివారిస్తుంది. పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగండి. అయితే పాలలో పసుపును మరీ ఎక్కువగా వేసుకోవద్దు. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు.
తేనె..
జలుబు , దగ్గు సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో తేనె కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందు కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె కలిపి తాగండి. రోజుకు రెండుసార్లు ఈ టీని తాగడం వల్ల జలుబు, దగ్గు లాంటి సీజనల్ సమస్యలు దూరమవుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: