Banana Eating: అరటిపండును ఎప్పుడు తినాలి..? ఎప్పుడు తినకూడదు..?

|

Nov 20, 2022 | 9:57 AM

అరటిపండు తినడం వల్ల మీ శరీరానికి చాలా ప్రయోజనాలు అందుతాయి. అయితే ఏ సమయంలో తింటే మంచిదో, ఏ సమయంలో తింటే ఆరోగ్యం పాడవుతుందో..

Banana Eating: అరటిపండును ఎప్పుడు తినాలి..? ఎప్పుడు తినకూడదు..?
Banana
Follow us on

అరటిపండు తినడం వల్ల మీ శరీరానికి చాలా ప్రయోజనాలు అందుతాయి. అయితే ఏ సమయంలో తింటే మంచిదో, ఏ సమయంలో తింటే ఆరోగ్యం పాడవుతుందో తెలుసుకోవాలి. అరటి పండులో కడలి, పచ్చె, నేంద్ర మొదలైన అనేక రకాలు ఉన్నాయి. ప్రతిరోజూ అరటిపండు తీసుకోవడం వల్ల మీ శరీరానికి 100% కేలరీలు అందుతాయి. అరటిపండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అరటిపండ్లు తినడానికి సరైన సమయం ఉందా? అనే విషయాలు తెలుసుకోండి. అరటి పండు పండినప్పుడు, దాని రుచి మరియు పోషక విలువలు మారుతాయి. బాగా పండిన అరటిపండు తాజాగా పండిన అరటిపండు కంటే ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది. తాజాగా పండిన అరటిపండ్లు తినడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఎక్కువ పండిన అరటి పండు అంటే దాని పైన ఉన్న తొక్క కొద్దిగా బ్రౌన్ కలర్‌గా మారినట్లయితే రోజూ తీసుకోవడం ద్వారా మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మీ శరీరానికి కావలసిన శక్తిని కూడా అందిస్తుంది. అరటిపండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది మీ శరీరంలో అమైనో ఆమ్లాన్ని అందిస్తుంది. ఇది మీ శరీరం సెరోటోనిన్ ఉత్పత్తి చేయడానికి కూడా సహాయపడుతుంది. సెరోటోనిన్ ఒక ముఖ్యమైన మెదడు రసాయనం. ఇది సహజమైన యాంటిడిప్రెసెంట్, ఆందోళన, నిద్రలేమికి సమస్యలను దూరం చేస్తుంది.

దగ్గు సమస్యతో బాధపడేవారు జాగ్రత్త

దగ్గు సమస్య ఉన్నవారు రాత్రిపూట అరటిపండ్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండ్లలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అయితే ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకండి. అరటిపండులో ఉండే ఆమ్ల స్వభావం కారణంగా ఖాళీ కడుపుతో తింటే పేగు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

ఈ రోజుల్లో మీరు కొనుగోలు చేసే ప్రతి పండు, కూరగాయలు రసాయన పురుగుమందులతో పండిస్తారు. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..