AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vakrasana Benefits: పొట్ట దగ్గర పెరిగిన కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారా.? వక్రాసనం ట్రై చేయండి మంచి ఫలితం ఉంటుంది.

Vakrasana Benefits: ఇటీవల శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతోంది. రోజులో ఎక్కువ సమయం కూర్చొనిచేసే పనులే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చొని పనిచేసే...

Vakrasana Benefits: పొట్ట దగ్గర పెరిగిన కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారా.? వక్రాసనం ట్రై చేయండి మంచి ఫలితం ఉంటుంది.
Vakrasana
Narender Vaitla
| Edited By: |

Updated on: Jul 21, 2021 | 9:16 AM

Share

Vakrasana Benefits: ఇటీవల శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతోంది. రోజులో ఎక్కువ సమయం కూర్చొనిచేసే పనులే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చొని పనిచేసే వారు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో ప్రధానమైంది పొట్ట పెరగడం. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. శారీరక శ్రమ లేకపోతుండడంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతోంది. యోగాసనలతో శరీరాన్ని అందంగా మార్చుకోవచ్చనే విషయం మనందరికీ తెలిసిందే. పొట్ట దగ్గర ఉన్న కొవ్వును కరిగించి శరీరాకృతిని అందంగా మార్చుకునేందుకు వక్రాసన ఉపయోగపడుతుంది. ఇంతకీ వక్రాసనను ఎలా వేయాలి. దీని ద్వారా కలిగే మరిన్ని లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆసనం ఎలా వేయాలి..?

ఇందు కోసం ముందుగా కాళ్లను ముందుకు చాపి నడుము నిటారుగా ఉండేలా కూర్చోవాలి. అనతంరం కుడి కాలును మ‌డిచి ఎడ‌మ మోకాలికి ఆనించాలి. ఎడ‌మ‌ కాలును నిటారుగానే ఉంచాలి. తర్వాత శ‌రీరాన్ని నెమ్మదిగా కుడి వైపునకు తిప్పాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడ‌మ చేత్తో కుడి మోకాలిని పొట్ట వైపు నెడుతూ ఎడ‌మ మోకాలిని ప‌ట్టుకోవాలి. కుడి చేతిని నడుము వెనక వైపు నేలపై ఆనించాలి. మెడను వెనక్కి తిప్పి శరీరాన్ని నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా రెండు వైపులా చేయాలి. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.

ఆసనంతో కలిగే లాభాలు..

* పొట్ట దగ్గర పెరిగిన కొవ్వు సులభంగా కరిగిపోతుంది. * అధిక బరువుతో సతమతమయ్యే వారికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. * ముఖ్యంగా నడుము, పిరుదుల దగ్గరగా పేరుకుపోయే అనవసర కొవ్వును కరిగించేస్తుంది. * నడుము నొప్పి తగ్గుతుంది. ఈ ఆసనం వల్ల వెన్ను దృఢంగా మారుతుంది. * కాళ్లు, చేతుల కండరాలు ఆరోగ్యంగా మారుతాయి. * గ్యాస్‌ సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. * ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తే శరీర ఆకృతి మెరుగుపడుతుంది. ముఖ్యమైన సూచన.. * గర్భిణీలు, నడుముకు ఏవైన ఆపరేషన్‌లు చేయించుకున్న వారు ఈ ఆసనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయకూడదు.

Also Read: LIC Arogya Rakshak: ఎల్ఐసీలో కొత్త పాలసీ.. కుటుంబం మొత్తాన్ని రక్షించే ఆరోగ్య రక్షక్ ప్లాన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Jojoba Oil : మొటిమల సమస్యకు దివ్యఔషధం జోజోబా ఆయిల్..! ఎలా వాడాలో తెలుసుకోండి..

Neuropathic Pain: తరచుగా తిమ్మిర్లు వస్తున్నాయా..నిర్లక్ష్యం వద్దు.. ఈ విటమిన్ లోపం ఏమో.. ఒక్కసారి చెక్ చేసుకోండి

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా