Headache: తలనొప్పితో బాధపడుతున్నారా.? అయితే ఈ అద్భుతమైన వంటింటి చిట్కాలను ట్రై చేయండి.!

Home Remedies To Cure Headache: ఈ ఆధునిక కాలంలో పని ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆర్ధిక సమస్యలు.. ఇలా పలు కారణాల వల్ల తరుచూ..

Headache: తలనొప్పితో బాధపడుతున్నారా.? అయితే ఈ అద్భుతమైన వంటింటి చిట్కాలను ట్రై చేయండి.!
Dipression

Updated on: May 27, 2021 | 7:10 PM

Home Remedies To Cure Headache: ఈ ఆధునిక కాలంలో పని ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆర్ధిక సమస్యలు.. ఇలా పలు కారణాల వల్ల తరుచూ మనకు తలనొప్పి వస్తుంటుంది. ఆ సమయంలో మనం ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగానూ, చిరాకుగానూ ఉంటుంది. ఒకవేళ నొప్పి మరింత ఎక్కువైతే.. అప్పుడు వచ్చే బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. అయితే ఈ తలనొప్పికి మన ఇంట్లో వాడే సహజసిద్ధమైన పధార్ధాలతో ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఇప్పుడు చూద్దాం..

  • బాగా తలనొప్పి కలిగినప్పుడు.. జీడిపప్పు, పిస్తా, బాదంపప్పులు తింటే కొంచెం నొప్పి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అవి పెయిన్ కిల్లర్స్ మాదిరి బాగా పని చేస్తాయి.
  • తలనొప్పి ఉన్న సమయంలో స్వచ్ఛమైన గాలిని కొంతసేపు పీల్చుకుని.. ఒంటరిగా కాసేపు వాకింగ్ చేయడం మంచిది
  • ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ అల్లం రసం కలుపుకుని తాగినా తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు
  • ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగినా కూడా తలనొప్పి నుంచి కాస్తా రిలీఫ్ లభిస్తుంది
  • మన శరీరంలో కొన్నిసార్లు నీరు శాతం తక్కువైనా.. తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
  • అందుకే నీటిని బాగా తాగితే తలనొప్పి తగ్గే అవకాశాలు ఉంటాయి

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!

Loading...
Unable to load recommendations.
Follow Us