Health Tips: ఈ ఐదు టిప్స్ పాటిస్తే చాలు.. మీ ఆరోగ్యం మీ వెంటే.. అన్ని సమస్యలు ఇక్కడి నుంచే..

|

Sep 22, 2021 | 5:03 PM

మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మనం తినే ఆహారమంతా నోటి నుంచే మన లోపలికి వెళ్తుంది. అందుకే మన నోరు శుభ్రంగా ఉండటం..

Health Tips: ఈ ఐదు టిప్స్ పాటిస్తే చాలు.. మీ ఆరోగ్యం మీ వెంటే.. అన్ని సమస్యలు ఇక్కడి నుంచే..
Better Oral Health
Follow us on

మీరు దంత సమస్యలతో బాధపడుతున్నారా..? పంటి నొప్పి వేదిస్తోందా..? మీ పంటి చిగురు వాచిందా..? సరిగ్గా జీర్ణం కావడం లేదా..? ఇలాంటి సమస్యలు వచ్చిన తర్వాత డాక్టర్లను సంప్రదిస్తుంటారు. అయితే సమస్య రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. అంతే కాదు నోరు శుభ్రంగా ఉండాలంటే దంతాలు పరిశుభ్రంగా ఉండటం అత్యవసరం. లేదంటే దంతాలు పుచ్చిపోవటం.. నోరు వాసన రావటం.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమస్యలను మిమ్మల్ని వేధిచకుండా ఉండాలంటే మీరు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మనం తినే ఆహారమంతా నోటి నుంచే మన లోపలికి వెళ్తుంది. అందుకే మన నోరు శుభ్రంగా ఉండటం తప్పనిసరి. నోరు శుభ్రంగా లేకపోతే ఎన్నో ఇతర అనారోగ్యాలు చుట్టుముడతాయని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. చిగుళ్ల నొప్పి, పంటి నొప్పి, పళ్ల నుంచి రక్తం కారటం, పళ్లు పుచ్చుపట్టిపోవటం వంటివి అయితే మీరు ఆ పంటి నొప్పిని భరించటమే కాదు ఒకవేళ ఆ దంతం తీసేయాల్సి వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఊహించుకోండి. వీటన్నిటికీ విరుగుడు ఓరల్ హైజీన్, డెంటల్ హైజీన్ అని దంత వైద్యులు సింపుల్ సలహా ఇస్తుంటారు.

చిన్న పిల్లల్లో పంటి సమస్యలు ఉండటం వల్ల పోషకాహారం తినకుండా వారు చిక్కిపోతారు.. బలహీనంగా మారుతుంటారు. అయినా ఓరల్ హెల్త్ ను మెయిన్టెన్ చేయటం పెద్ద కష్టమేమీ కాదని డెంటల్ డాక్టర్లు చాలా సార్లు చెబుతుంటారు. ప్రతి రోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవటంతో పాటు రెగ్యులర్‌గా డెంటల్ చెకప్ చేయించుకుంటే చాలా సమస్యలకు చెక్ పట్టవచ్చని అంటున్నారు.

ఓరల్ హైజీన్ కోసం ఇలా చేయండి..

1. రఫ్ బ్రషింగ్ మంచిది కాదు..

ప్రతీ రోజూ బ్రష్ చేసుకునేప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న విషయాల పట్ల ద‌ృష్టి పెడితే పెద్ద సమస్యలను దగ్గరకు రాకుండా దూరం చేసుకోవచ్చు. కొందరు చాలా రఫ్‌గా బ్రష్ చేస్తుంటారు. ఇలా బలవంతంగా చేసే బ్రషింగ్‌తో పంటిపైన ఉన్న సున్నితమైన ఎనామిల్ పొర డ్యామేజ్ అవుతుంది. దీంతో మీకు సెన్సిటివిటీ సమస్య మొదలవుతంది. కాబట్టి మరీ హార్డ్  బ్రషింగ్ చేయకండి. మరికొందరైతే చాలా సేపు బ్రష్ చేస్తుంటారు. అలా అతిగా చేయడం కూడా ప్రమాదమే అంటున్నారు డాక్టర్లు. ఇంకొందరు ఏకంగా కొన్ని సెకెన్లపాటు చేసి.. నామమాత్రంగా మమా అని అనిపిస్తుంటారు. ఇలా కూడా చేయకండి. కనీసం 1-2 నిమిషాలపాటు చక్కగా బ్రష్ చేయండని అంటున్నారు డాక్టర్లు.

2. దంతాలే కాదు చిగుళ్లు ముఖ్యమే..

చక్కగా మెరిసే దంతాలు ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. మీ దంతాలు ఎంత ముఖ్యమైనవో చిగుళ్లు కూడా అంతే ముఖ్యం. తరచూ మీ చిగుళ్లు చీల్చుకుని రక్తం కారుతుంటే.. మీరు జాగ్రత్త పడాలని అర్థం. ఇక కరకరలాడే పదార్థాలు తిన్నప్పుడు మీ చిగుళ్లు గాయాలు కాకుండా జాగ్రత్తగా నమలండి. ఇక ఇన్ఫ్లమేషన్ కారణంగా చిగుళ్లు పాడవ్వటం సర్వసాధారణం. అందుకే బ్రష్ చేశాక.. మీ చిగుళ్లపై సున్నితంగా రబ్బరుతో చిన్నగా మసాజ్ చేయండి. అంతేకాదు ఏదైనా తిన్నాక చిన్న ముక్కల్లాంటివి మీ చిగుళ్లపై పేరుకోకుండా జాగ్రత్తపడండి. ఇలా చిన్న పరమాణువులు దంతాలు, చిగుళ్లపై పేరుకుంటే ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లు వచ్చే ప్రమాదముంది. కాబట్టి తరచూ నీటితో పుక్కళించండి. ఇలా చిక్కుకున్న ఆహారం బయటికి వచ్చేస్తుంది.

3. దంతాలు ఆహారం తినేందుకు మాత్రమే

మనం పళ్లను ఆహారం నమిలేందుకు మాత్రమే ఉపయోగించాలి. అలా కాకుండా కొందరు పళ్లను ఓపనర్‌గా, ప్యాకేజింగ్ టేపు తీసేందుకు, బట్టలు కుట్టేప్పుడు దారం తెంచేందుకు ఉపయోగిస్తుంటారు. మీ దంతాలు చాలా బలంగా ఉన్నాయని పదేపదే ఇలాంటివి చేస్తే పళ్లు వదులు అయి తొందరగా పడిపోతాయి.

4. ఫ్లోరైడ్ బెనిఫిట్స్

ప్రకటనలు చూసి టూత్ పేస్టులను కనవద్దు.  అందులో మౌత్ వాషుల్లో ఎటువంటి పదార్ధాలున్నాయో చెక్ చేసుకోవాలి. ఇందులో విపరీతమైన, ఘాటు రసాయనాలు ఉంటే మాత్రం వీటిని కొనకండి. అందుకే ఓరల్ కేర్ ప్రాడక్ట్స్ పై ఉన్న ఇంగ్రేడియంట్ లేబుల్ ను బాగా చదవండి. ఇందులో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నదాన్నే ఎంచుకోండి. ఫ్లోరైడ్ ఉన్న పేస్టుతో బ్రష్ చేస్తే మీ దంతాలు డ్యామేజ్ కావు, డెంటల్ కేర్ లో ఫ్లోరైడ్ కీలక పాత్ర పోషిస్తుంది.

5. ఎనామిల్ తో జాగ్రత్త

పంటి సంరక్షణలో అత్యంత సున్నితమైనది.. చివరిది ఎనామిల్ కాపాడుకోవడం. ఎనామిల్ డ్యామేజ్ అయిందో మీకు ఇక సెన్సిటివిటీ, దంతాల నొప్పులు, దంత క్షయం విపరీతంగా పెరిగిపోతుంది. ఎనామిల్ దెబ్బతినకుండా ఉండాలంటే కొన్నింటిని మనం పక్కన పెట్టడం చాలా అవసరం. ఇందులో సోడాలు, షుగరీ డ్రింగ్స్, ఆల్కహాల్, ధూమపానం వంటివి మీ దంతాలను పూర్తిస్థాయిలో దెబ్బ తీస్తుంటాయి. ఇక పళ్ల రసాలు మంచివని ఎక్కువగా లాగిస్తుంటే.. అవి కూడా మీ పళ్లు త్వరగా పటుత్వం కోల్పోయి ఊడతాయి. అందుకే చక్కెర కలిపిన జ్యూసులను సాధ్యమైనంతగా తగ్గించుకోండి. అవసమైతే పళ్లను తినండి. ఒకవేళ పళ్ల జ్యూసులు తాగాల్సివస్తే చక్కెర వేయకుండా తాగండి. వైద్యులు చెప్పే ఇలాంటి సలహాలను తప్పకుండా పాటిస్తే మన ఆరోగ్యం పదికాలల పాటు జాగ్రత్తగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Liquor Shops: మద్యం షాపు యజమానులకు గుడ్‌న్యూస్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్..

Kerala High Court: కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పు.. అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి..