
Hepatitis Disease: ఇప్పుడున్న కాలంలో అందరి జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి తదితర కారణాల వల్ల వివిధ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇక వెంటాడుతున్న వ్యాధుల్లో హెపటైటీస్ వ్యాధి ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది శరీరంలోని కాలేయం (లివర్)పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈహెపటైటీస్ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి తీవ్రత సిర్రోలిక్ దశకు చేరుకుని ఏకంగా కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ దశలోకాలేయం మార్పిడి చేయాల్సి వస్తుంది. అందుకు వ్యాధి బారినపడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు.
వ్యాధి లక్షణాలు:
☛ కామెర్లు, రక్తం వాంతులు
☛ విరోచనాలు, అలసట ఎక్కువగా ఉండటం
☛ ఆకలి లేకపోవడం
☛ కడుపు నొప్పి
☛ క్రమ క్రమంగా బరువు తగ్గిపోవడం
☛ కండరాలు, కీళ్ల నొప్పులు అధికంగా ఉండటం
☛ జ్వరం
☛ కాళ్లు, పొట్టవాపు
☛ చర్మం, కళ్లు పచ్చగా మారడం
☛ నల్లరంగులో విరోచనాలు
☛ పగలు నిద్ర, రాత్రుల్లో మెలకువగా ఉండట
చికిత్స
☛ వ్యాధి నివారణకు శాశ్వత చికిత్స లేదు
☛ వ్యాధిగ్రస్థుడు ప్రతియేటా వైద్య పరక్షలు చేయించుకోవాలి
☛ హెపటైటీస్ టీకా వేయించుకోవాలి.
☛ వారానికి ఒక ఇంట్రఫిరాన్ ఇంజక్షన్ వేసుకోవాలి.
☛ అతి ఖర్చుతో కూడినది కారణంగా మాత్రల ద్వారా నియంత్రణ చేయవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..