Ghee Health Benefits: రోజూ నెయ్యి తినేవారికి అద్భుతమైన ప్రయోజనాలు..!

Ghee Health Benefits: నెయ్యి అంటే చాలా మందికి ఇష్టమే. కానీ కొందరికి పెద్దగా ఇష్టం ఉండదు. నెయ్యి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. స్వచ్ఛమైన నెయ్యితో జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు..

Ghee Health Benefits: రోజూ నెయ్యి తినేవారికి అద్భుతమైన ప్రయోజనాలు..!
Ghee Health Benefits
Subhash Goud

|

Sep 22, 2022 | 7:35 AM

Ghee Health Benefits: నెయ్యి అంటే చాలా మందికి ఇష్టమే. కానీ కొందరికి పెద్దగా ఇష్టం ఉండదు. నెయ్యి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. స్వచ్ఛమైన నెయ్యితో జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిననిదే ముద్ద ముట్టరు. అయితే నెయ్యి రుచి, వాసనను పెంచడమే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే భారతదేశంలో నెయ్యి తినే పద్ధతి యుగయుగాలుగా కొనసాగుతోంది. నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడ్డాయి. అనేక ప్రయోజనాలు ఉన్న కారణంగా నెయ్యిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు. మీ రోజువారీ ఆహారంలో కొద్దిగా నెయ్యి ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యితో ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్‌ ఉన్నాయని అంటున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

నెయ్యి రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశీ నెయ్యిలో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడటంతో ఎంతగానో సహాయపడుతుంది.

జ్ఞాపకశక్తి పెంచుతుంది:

నెయ్యి తినడం వల్ల మన జీర్ణ శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఉండే పదార్థాలు ఆలోచనా శక్తిని పెంచుతాయి. ఇది కణాలు, కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తినడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ మెరుగుపడుతుంది. నెయ్యి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా, చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యి చర్మం, జుట్టుకు ప్రకాశాన్ని తెస్తుంది.

ఒమేగా కొవ్వు ఆమ్లాలు:

ఇక నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా, ప్రకాశవంతమైన కంటి చూపు, క్యాన్సర్ నివారణ, మలబద్ధకం నివారణకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu