Heart Health: గుండె ఆరోగ్యానికి ఈ ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోండి.. వీటితో మరెన్నో ప్రయోజనాలు..

|

Jul 18, 2022 | 7:41 PM

హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే.. గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

Heart Health: గుండె ఆరోగ్యానికి ఈ ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోండి.. వీటితో మరెన్నో ప్రయోజనాలు..
Heart Health
Follow us on

Heart Health Tips: దైనందిన జీవితంలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యమైన అవయవాలపై దృష్టిసారించకపోతే ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశముంది. శరీరంలో చాలా ముఖ్యమైన భాగం గుండె. ఇది జీవితం ప్రారంభం నాటి నుంచి చివరి శ్వాస వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే.. గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో.. మన రోజువారీ ఆహారంపై శ్రద్ధ వహించడం చాలాముఖ్యం. ఆరోగ్యానికి హానికలిగించే ఆహారాన్ని మినహాయించి ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తినాలని సూచిస్తున్నారు నిపుణులు. అయితే.. కొన్ని ఎల్లో ఫ్రూట్స్ (పసుపు పండ్లు), కూరగాయలను తినడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ ఫ్రూట్స్, కూరగాయలు ఏంటో తెలుసుకోండి..

ఈ పదార్థాలతో గుండెపోటు ప్రమాదం తక్కువ..

మామిడికాయ: మామిడికాయ పేరు వినగానే చాలామంది నోట్లో నీరురూతుంది. వేసవి కాలంలోనే ఈ పండ్లు లభిస్తాయి. అందుకే చాలామంది వీటికోసం ఎదురు చూస్తుంటారు. రుచిగా ఉండే ఈ పండు గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ: నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. ఇవి ఆహారం, సలాడ్లలో ఉపయోగిస్తారు. దీంతోపాటు నిమ్మరసం కూడా చేసుకోని తాగుతారు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అలాగే బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

అరటిపండు: అరటిపండును తినని వారు చాలామంది ఉంటారు. అయితే.. అరటిపండు ఆరోగ్యానికి చాలామంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. అరటిపండ్లను పరిమిత పరిమాణంలో తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

పైనాపిల్: పైనాపిల్‌ కూడా ఆరోగ్యానికి చాలామంచిది. అయితే దీన్ని తినడం వల్ల గుండెపోటు రిస్క్ చాలా వరకు తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయితే, ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. కావున దీనిని మితంగా తినాలి.

బెల్ పెప్పర్: క్యాప్సికమ్‌లో ఫైబర్, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా లభిస్తాయి. దీని కారణంగా శరీరానికి చాలా శక్తి లభిస్తుంది. అదే సమయంలో శరీరంలో రక్త హీనత ఏర్పడదు. దీంతోపాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..