Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: చాయ్‌తో బిస్కెట్లు తింటున్నారా? బిగ్ షాకింగ్ న్యూస్ మీకోసమే..!

చాయ్.. చాయ్.. చాయ్.. ఎవరండీ చాయ్‌ని ఇష్టపడని వారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చాయ్ తాగనిదే తమ రోజులు మొదలు పెట్టారు. అందుకే చాయ్ మీద ఎన్నో పాటలు కూడా వచ్చాయి. ఉదయం నిద్ర లేవగానే చాయ్ తాగి.. మిగతా పనులు పూర్తి చేసుకుంటారు. అయితే, కొందరు చాయ్ మాత్రమే తాగితే.. మరికొందరు ఆ చాయ్‌లో బిస్కెట్, బ్రెడ్, అప్పలు వేసుకుని తింటారు. అయితే, చాయ్ తాగితే రిలాక్స్ అవుతారు. బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. ఇక ఆ చాయ్‌లో బిస్కెట్ తింటూ ఆస్వాదించే వారు చాలా మందే ఉన్నారు. తినేందుకు బాగానే ఉంటుంది.

Health Tips: చాయ్‌తో బిస్కెట్లు తింటున్నారా? బిగ్ షాకింగ్ న్యూస్ మీకోసమే..!
Heart Stroke
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 19, 2023 | 8:49 PM

Health News: చాయ్.. చాయ్.. చాయ్.. ఎవరండీ చాయ్‌ని ఇష్టపడని వారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చాయ్ తాగనిదే తమ రోజులు మొదలు పెట్టారు. అందుకే చాయ్ మీద ఎన్నో పాటలు కూడా వచ్చాయి. ఉదయం నిద్ర లేవగానే చాయ్ తాగి.. మిగతా పనులు పూర్తి చేసుకుంటారు. అయితే, కొందరు చాయ్ మాత్రమే తాగితే.. మరికొందరు ఆ చాయ్‌లో బిస్కెట్, బ్రెడ్, అప్పలు వేసుకుని తింటారు. అయితే, చాయ్ తాగితే రిలాక్స్ అవుతారు. బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. ఇక ఆ చాయ్‌లో బిస్కెట్ తింటూ ఆస్వాదించే వారు చాలా మందే ఉన్నారు. తినేందుకు బాగానే ఉంటుంది. అయితే, ఆరోగ్య పరంగా చాలా ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు.

తాజాగా ఓ పరిశోధనలో చాయ్ బిస్కెట్ కలిపి తినడం ప్రమాదకరం అని తేలింది. టీతో పాటు బిస్కెట్లు, స్నాక్స్ తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. బ్రిటన్‌లో ఈ అంశంపై ఓ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం తరువాత.. బ్రిటీష్ ప్రభుత్వం ఫుడ్ మెనూ నుండి బిస్కెట్లు, కేక్‌ల వంటి స్నాక్స్‌ను తొలగించాలని యోచిస్తోంది. లండన్ పరిశోధకులు 850 మందికి పైగా ఆహారపు అలవాట్లను అధ్యయనం చేయడం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చారు. ప్రతి నలుగురిలో ఒకరికి గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? పరిశోధకులు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..

రక్తంలో చక్కెర స్థాయి పెరగడం..

ఇవి కూడా చదవండి

జంక్ ఫుడ్ ఎక్కువగా తినే వారు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని అధ్యయనంలో తేలింది. ఈ వ్యక్తులలో, స్ట్రోక్, గుండె జబ్బులు, ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోంది. అంతే కాదు వీరిలో బ్లడ్ షుగర్ లెవెల్ కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

చాలా లోతైన విశ్లేషణలో, కొంతమంది ఆరోగ్యకరమైన ఆహారం తిన్నప్పటికీ ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఉంటారు. ఎందుకంటే వారు టీతో పాటు బిస్కెట్లు లేదా వేయించిన ఆహారాన్ని తింటారు. ఇందుకోసం పరిశోధకులు 854 మంది ఆహారపు అలవాట్లపై చాలా రోజులుగా పరిశోధన జరిపారు. వారిలో 95 శాతం మంది సరైన సమయానికి ఉదయం భోజనం చేశారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్స్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. 26 శాతం మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. అయితే ఫ్రైస్ వంటి అనారోగ్యకరమైన స్నాక్స్ తినడం ద్వారా పోషకాలన్నింటినీ వృధా చేస్తున్నారని లండన్లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు తెలిపారు. ఈ వ్యక్తుల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని చెబుతున్నారు. చాలా మంది ప్రజలు కుకీలు, పండ్లు, గింజలు,చీజ్, వెన్న, కేక్, బిస్కెట్లు, కేకులు మొదలైన వాటిని అల్పాహారం కోసం తింటారు. వీటి కారణంగా వారి రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం వైద్య పరిశోధనల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఏవైనా సందేహాలుంటే.. వైద్యుడిని సంప్రదించి అవసరమైన చర్యలు పాటించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..