Heart Attack: గుప్పెడంత గుండెకు చిన్న వయసులోనే ముప్పు.. 30 ఏళ్లు రాక ముందే హార్ట్‌ ఎటాక్‌లు

|

Mar 04, 2023 | 4:25 PM

ఈ రోజుల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోయింది. దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మరణాలు సంభవిస్తున్నాయి..

Heart Attack: గుప్పెడంత గుండెకు చిన్న వయసులోనే ముప్పు.. 30 ఏళ్లు రాక ముందే హార్ట్‌ ఎటాక్‌లు
Heart Attack
Follow us on

ఈ రోజుల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోయింది. దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మరణాలు సంభవిస్తున్నాయి. చీరాల మండలం వాకావారిపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా గుండెపోటు రావడంతో మరణించాడు. ఫిబ్రవరి 20న హల్దీ పంక్షన్‌లో రబ్బానీ అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పలికూపోయాడు. ఫిబ్రవరి 24న విశాల్‌ అనే వ్యక్తి జిమ్‌ చేస్తుండగా చనిపోయాడు. ఫిబ్రవరి 25న పెళ్లీ పీటల మీదే వధువు గుండె ఆగిపోయింది. ఫిబ్రవరి 26న డ్యాన్స్‌ చేస్తుండగా, ముత్యం అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూపోయి మరణించాడు. ఫిబ్రవరి 28న బ్యాడ్మెంటన్‌ ఆడుతూ శ్యామ్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. మార్చి 2వ తేదీని కాలేజీలో నడుస్తున్న బీటెక్‌ విద్యార్థి గుండెపోటు వచ్చి మృతి చెందాడు.

మార్చి 3న పెద్దపల్లిలో శైలేందర్‌ అనే వ్యక్తి గుండెపోటు వచ్చి కుప్పలికూపోయాడు. మార్చి 4న క్లాస్‌ రూమ్‌లో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా వీరబాబు అనే వ్యక్తి గుండెపోటుతు మరణించాడు. అయితే ఇవన్నీ కూడా కెమెరాకు చిక్కిన కొన్ని దృశ్యాలు మాత్రమే. కెమెరాకు, సీసీ పుటేజీలకు చిక్కని మరణాలు ఇంకెన్నో ఉండవచ్చు. ఇలా రోజురోజుకు గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. హార్ట్‌స్ట్రోక్‌ తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్‌గా మారింది.

30 ఏళ్లు రాక ముందే హార్ట్‌ ఎటాక్‌లు:

ప్రస్తుత రోజుల్లో కనీసం 30 ఏళ్లు రాకముందే హార్డ్‌ ఎటాక్‌లు వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి విధానంలో మార్పుల కారణంగానే చిన్న వయసులో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయంటున్నారు వైద్య నిపుణులు. గుండెపోటుకు లైఫ్‌స్టైల్‌లో తేడాలే కారణమా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. కరోనా తర్వాత గుండె ముప్పు వెంటాడుతోంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగడం గుండెపోటుకు ఓ కారణంగా చెబుతున్నారు వైద్యులు. అలాగే జన్యుపరంగా కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని వివరిస్తున్నారు. ఒక్కోసారి వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కూడా గుండెకు డేంజరే. ఇప్పుడు 30ఏళ్ల వయసులోనే గుండెకు ముప్పు తప్పడం లేదు. మనిషి ఎంతో ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నా నో గ్యారంటీగా మారిపోయింది. ఫిట్‌గా ఉన్నా.. ఫ్యాట్‌గా ఉన్నా డేంజరే అంటున్నారు. గుప్పెడంత గుండెకు.. చిన్నవయసులోనే ముప్పు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

గుండెపోటు అంటే ఏమిటి?:

కరోనరీ ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. ఇవి గుండె కండరాలకు రక్తాన్ని తీసుకువెళ్లే రక్త నాళాలు. గుండె కండరాలు పని చేయడానికి ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం అవసరం. కరోనరీ ధమనులలో అడ్డుపడటం వలన గుండెపోటు సంభవిస్తుంది. ఎందుకంటే రక్తం కండరాలకు చేరదు. అడ్డుపడే కరోనరీ ధమనులు తగినంత త్వరగా తెరవబడకపోతే గుండె కండరాలు చనిపోవడం ప్రారంభమవుతుంది.

గుండెపోటు లక్షణాలు ఏమిటి?

అసౌకర్యం, ఒత్తిడి, భారం, బిగుతు, లేదా మీ ఛాతీ లేదా చేయి లేదా మీ ఛాతీ కింద నొప్పి, మీ వెనుక దవడ, గొంతు లేదా చేయిలో అసౌకర్యంగా ఉండటం, అజీర్ణం లేదా ఊపిరాడకుండా ఉండటం, చెమట, కడుపు నొప్పి , వాంతులు, లేదా మైకము, తీవ్రమైన బలహీనత, ఆందోళన, అలసట, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. వేగవంతమైన లేదా అసాధారణ హృదయ స్పందన.

గుండె పోటుకు ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి:

☛ గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి.

☛ రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటే వైద్యుడిని సంప్రదించాలి.

☛ తరచుగా జలుపు, జ్వరం, దగ్గు వస్తున్నా.. అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాలి. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే.

☛ శరీరం పై భాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే తప్పకుండా గుండె నొప్పి రాబోతుందని గుర్తించాలి.

☛ గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

☛ మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి.

☛ తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు.

☛ మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురికావడం, చెప్పాలనుకొనే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వంటి సూచనలను కూడా గుండెపోటుకు సంకేతాలుగా భావించాలి.

☛ కొందరికి దవడలు, గొంతు నొప్పులు కూడా గుండె నొప్పికి సంకేతాలు.

☛ వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండెనొప్పికి దారితీస్తాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.

☛ కంటి చివరిలో కురుపులు ఏర్పడినా నిర్లక్ష్యం వద్దు. అవి గుండె పోటుకు దారితీయొచ్చు.

☛ కాళ్లు, పాదాలు, మడమలు ఉబ్బుతున్నట్లయితే గుండె పోటుగా అనుమానించాలి.

☛ గుండె సమస్యలుంటే.. తప్పకుండా హార్ట్ బీట్‌ను చెక్ చేసుకోవాలి. అసాధారణంగా గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి