Heart Attack: ఇవే ఆకస్మిక గుండె పోటుకు ప్రధాన కారణాలా..? హార్ట్ ఎటాక్స్ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే..?

|

Apr 04, 2023 | 9:47 AM

వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బులతో ప్రజలు చనిపోతున్నారు. ఉదయం ఉల్లాసంగా నవ్వుతూ ఉన్నవారు మధ్యహ్నానికి ఎలా ఉంటారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే గుండెపోటుకు, అది సంభవించే ముందు కలిగే క్రమరహిత హృదయ స్పందనకు అనేక కారణాలు ఉన్నాయి. అవును, అటువంటి..

Heart Attack: ఇవే ఆకస్మిక గుండె పోటుకు ప్రధాన కారణాలా..? హార్ట్ ఎటాక్స్ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే..?
Cardiac Arrest
Follow us on

ఈ మధ్య కాలంలో అకస్మిక గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బులతో ప్రజలు చనిపోతున్నారు. ఉదయం ఉల్లాసంగా నవ్వుతూ ఉన్నవారు మధ్యహ్నానికి ఎలా ఉంటారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే గుండెపోటుకు, అది సంభవించే ముందు కలిగే క్రమరహిత హృదయ స్పందనకు అనేక కారణాలు ఉన్నాయి. అవును, అటువంటి వాటిలో మొదటి కారణం మనం తినే ఆహారమేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీవనశైలిలో విపరీతమైన మార్పు, తీసుకునే ఆహారపు అలవాట్లలో మార్పు, శారీరక శ్రమ లోపించడం, విపరీతమైన మానసిక ఒత్తిడి వంటివి కూడా గుండె సమస్యలకు దారితీస్తాయి. ఇంకా గుండె జబ్బులకు వేపుడు లేదా వేయించిన ఆహార పదార్థాలు కూడా కారణమేనని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. గుండె జబ్బులకు మరో కారణం ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా అనేది అందరికీ తెలిసిందే. ఉప్పుతో లో బీపీ, లేదా హై బీపీ రావచ్చు.. ఇదే రానున్న కాలంలో గుండె సమస్యగా మారే అవకాశం ఉంది.

ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి..

షుగర్ లేదా పాలిష్ చేసిన ఆహారాలు తీసుకోవడం కూడా గుండెపోటుకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా మైదా, సెమోలినా, ఉదా సెమోలినా వంటి వాటితో చేసిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి రక్తాన్ని చిక్కగా చేస్తాయి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల కూడా శరీరంలో కొవ్వు పెరుగుతుంది. అదనంగా ఇటువంటి పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా విపరీతంగా పెంచుతాయి.ఫలితంగా గుండెకు సరైన రక్త సరఫరా జరగదు. తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.

తినాల్సిన ఆహారాలివే..

గుండెపోటు రాకుండా ఉండాలంటే శాఖాహారమే ఉత్తమమైన ఆహారం అని కార్డియాలజీ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలని వారు చెబుతున్నారు. అందుకోసం అవిసె గింజలు, వాల్‌నట్స్, బాదం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా ఆయిల్ బేస్డ్ ఫుడ్స్ తగ్గించడం, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి మానేయడం వల్ల గుండెకు పదేళ్ల వరకు జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం కూడా మంచిదేనట. ఇంకా శారీరక శ్రమ అనేది గుండె, ఇంకా శరీర ఆరోగ్యానికి చాలా అవసరమని.. అందుకోసం కనీసం ఇంట్లో కొన్ని పనులను అయినా విధిగా చేయాలని వారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి…