AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: స్టైల్ విషయంలో తగ్గేదేలే..! ఒక్క హెయిర్‌కట్‌తో మోడల్‌‌గా మారిన ‘మన్కీ కింగ్’.. చూస్తే నవ్వాగదుగా..

ఎంతో మంది మోడల్ అని చెప్పకుంటూ తమ హెయిర్‌ స్టెయిల్‌కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే అలాంటి హెయిర్‌ స్టెయిల్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కానీ అందులో ఉన్నది..

Watch Video: స్టైల్ విషయంలో తగ్గేదేలే..! ఒక్క హెయిర్‌కట్‌తో మోడల్‌‌గా మారిన ‘మన్కీ కింగ్’.. చూస్తే నవ్వాగదుగా..
Monkey's New Haircut
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 03, 2023 | 12:08 PM

Share

అందంగా హెయిర్ స్టెయిల్ చేసుకుని నలుగురిలో మోడల్‌లా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకోసం నెలకోసారి హెయిర్‌కటింగ్స్, హెయిర్ కలర్స్‌.. ఇలా ఏవేవో చేస్తుంటాం కదా.. దానికి తోడు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ‘మోడల్ మోడల్’ అనే సాంగ్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ పాట పెట్టుకుని ఎంతో మంది మోడల్ అని చెప్పకుంటూ తమ హెయిర్‌ స్టెయిల్‌కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే అలాంటి హెయిర్‌ స్టెయిల్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కానీ అందులో ఉన్నది మనిషి అయితే కాదు. అవును, ఓ మర్కటం.. అదేనండీ, మన కోతి బార్బర్ షాప్‌కి వెళ్లి స్పైకీ హెయిర్ కటింగ్ చేయించుకుంది. అంతేనా.. దీనికి సంబంధించిన వీడియోను కూడా నెట్టింట పోస్ట్ చేయించుకుంది. అంతే.. ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

shravangoud_writes.official అనే ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ అయిన వీడియోలో ఈ దృశ్యాలను మీరు చూడవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో మోడల్ మోడల్ పాట వస్తుంటే.. ఆ కోతి వీడియోకు ఫోజులిస్తుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘కోతితో కటింగ్ షాప్ అన్న: హీరోలా ఉన్నావు తమ్ముడు’ అని అంటాడని రాసుకొచ్చాడు. అలాగే మరొకరు ‘బ్రొక్ లెస్నర్’ అని డబ్య్లూడబ్ల్యూఈ రెజ్లర్‌తో పోల్చాడు. ఇంకో నెటిజన్ అయితే ‘మన్కీ మోడల్’ అన్నాడు. ఇంకా ‘వీడు కదా అసలైన మన్కీ కింగ్’ అంటూ.. ఇలా నెటిజన్లు వారివారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు లక్షా 40 వేల లైకులు, ఇంకా 19 లక్షలకు పైగా వీక్షణలు దక్కాయి. ఇంకా ఈ వీడియోను అనేక మంది షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మీరు కూడా ‘మన్కీ మోడల్’ వీడియోను ఇక్కడ చూడండి.. 

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..