Healthy Foods for Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరి.. కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

|

May 10, 2022 | 4:43 PM

Healthy Foods for Lungs: నియంత్రణ లేని ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వల్ల ఊపిరితిత్తులు పనిచేసే సామర్థ్యం తగ్గిపోతోంది. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలతో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తగినంత నీరు తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Healthy Foods for Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరి.. కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాల్సిందే..
Lungs Health
Follow us on

Healthy Foods for Lungs: ఊపిరితిత్తులు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు కూడా తరచూ సూచిస్తుంటారు. ఊపిరితిత్తులు దెబ్బతింటే ఆస్తమా, క్యాన్సర్, క్షయ, న్యుమోనియా వంటి పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాగా రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం ఊపిరితిత్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అదేవిధంగా నియంత్రణ లేని ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వల్ల ఊపిరితిత్తులు పనిచేసే సామర్థ్యం తగ్గిపోతోంది. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలతో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తగినంత నీరు తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే పోషకాహారం బాగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఎటువంటి ఆహారాలను డైట్‌ (Healthy Diet) లో చేర్చుకోవచ్చో తెలుసుకుందాం రండి.

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చడంలో సహాయపడతాయి. అదేవిధంగా ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తాయి.

ఇవి కూడా చదవండి

పాలకూర

పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. బీటా కెరోటిన్, క్లోరోఫిల్, జియాక్సంతిన్, లుటిన్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా క్లోరోఫిల్ వంటి యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఎండుద్రాక్ష

ఎండు ద్రాక్ష ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కొన్ని నానబెట్టిన ఎండు ద్రాక్షలు ఉదయం పరగడుపునే తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులోని పోషకాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

టమోటా

టొమాటోల్లో లైకోపీన్ అనే రసాయన మూలకం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా, బలంగా మార్చడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది.

మెంతికూర

మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు మెంతి టీని తీసుకోవచ్చు. ఈ టీ తాగడం వల్ల కఫం తగ్గుతుంది. ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.

పసుపు

పసుపులో కర్క్యుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాలుష్యం వల్ల కలిగే వాపు నుంచి ఊపిరితిత్తులను రక్షించడంలో సహాయపడతాయి.

అల్లం

అల్లంలో జింజెరాల్ అనే రసాయన మూలకం ఉంటుంది. ఇది దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లంలో ఉండే పోషకాలు ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయిందా? ఆరోజే రానుందంటూ జోరుగా ఊహాగానాలు..

Harish Rao: అబద్ధాల్లో బీజేపీకి నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వచ్చు.. ఆ రెండు పార్టీలు తెలంగాణకు హానికరం: మంత్రి హరీశ్‌

Beast OTT: డిజిటల్‌ స్ర్కీన్‌పై యాక్షన్‌ ఫీస్ట్‌ అందించేందుకు సిద్ధమైన బీస్ట్‌.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి విజయ్‌ సినిమా.. ఎక్కడంటే..