పిల్లలు ఆరోగ్యంగా, బరువుగా ఉండాలని తల్లులు తెగ కష్టపడిపోతూంటారు. ఏది తింటే మంచిది? అని తెగ ఆలోచిస్తారు. కట్ చేస్తే వీరి ఎంత్ర శ్రమ పడినా.. పిల్లలు సరిగ్గా తినరు. దీంతో నిరాశ చెందుతారు. అయితే పిల్లలు బరువు పెరిగేందుకు సహజసిద్ధమైన ఆహార పదార్థాలు చాలా ముఖ్యం. తల్లులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పిల్లల అందరూ ఒకేలా ఉండారు. ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. దానిని బట్టి వారికి ఆహారం ఇవ్వాలి. అయితే పిల్లలు ఆరోగ్యంగా బరుపు పెరగాలంటే ఏం తినిపిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు: పిల్లలు ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి చాలా పదార్థాలే ఉన్నాయి. ముఖ్యంగా పాలు.. పిల్లల ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. అలాగే బాదం, జీడి పప్పు కూడా ఇవ్వొచ్చు. బాదం, పిస్తా, జీడిపప్పును పౌడర్ లా కూడా చేసి పాలల్లో కలిపి పిల్లకు ఇస్తే మంచింది. ఖర్జూరం కూడా పాలల్లో కలిపి ఇవ్వొచ్చు.
చికెన్: పిల్లలకి చికెన్ కూడా ఇవ్వొచ్చు. చికెన్ లో కూడా కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మటన్, బీఫ్ తినే వారికి కూడా వీటిని ఇవ్వొచ్చు. కొవ్వుని అందించేందుకు చికెన్ ని బటర్ చికెన్ రూపంలో కూడా అందించవచ్చు.
గుడ్డు: పిల్లలకు గుడ్డు ఇస్లే చాలా బలం. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. గుడ్డు సొన, తెల్లసొన ఇవ్వొచ్చు. ఆమ్లెట్ లా కూడా చేసి పిల్లలకు ఇస్తే మంచిది. వెన్న, నెయ్యితో దోశలు కూడా ఇవ్వొచ్చు.
పెరుగు: పెరుగు కూడా చాలా మంచిది పిల్లలకు. కొవ్వు లేని పెరుగు కూడా అందించవచ్చు. ఇందులో పండ్లు కలిపి ఇవ్వవచ్చు.
పైన చెప్పిన వాటితో పాటు వేరు శనగ, ఖర్జూరం, పీనట్ బటర్, చిలకడ దుంప, యాపిల్, జామ, ముఖ్యంగా అరటి పండు పిల్లలకు ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..