Period Food: పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏం తినకూడదు? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

పీరియడ్స్ సమయంలో చాలా మంది అమ్మాయిలకు కడుపు నొప్పి, నడుము నొప్పి, తుంటి నొప్పి, కాళ్ల నొప్పులు వస్తాయి. విపరీతమైన అలసట కూడా ఉంటుంది.

Period Food: పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏం తినకూడదు? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Period

Updated on: Oct 03, 2022 | 9:55 PM

పీరియడ్స్ సమయంలో చాలా మంది అమ్మాయిలకు కడుపు నొప్పి, నడుము నొప్పి, తుంటి నొప్పి, కాళ్ల నొప్పులు వస్తాయి. విపరీతమైన అలసట కూడా ఉంటుంది. అయితే, అలాంటి సమయాల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తినకూడదు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పీరియడ్స్ సమయంలో మహిళలు తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుంటారు. తీవ్రమైన ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, కడుపు నొప్ప, వికారం, అలసట, డయేరియా వంటి సమస్యలతో సతమతం అవుతుంటారు. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో సమస్య మరింత పెరగకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోకపోవడం కూడా ముఖ్యం. మరి పీరియడ్స్ సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణులు ఏం చెబుతురన్నారనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పీరియడ్స్ సమయంలో తినాల్సి పదార్థాలు..

1. నీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా ఉండే పండ్లు, ఫలహారాలు తీసుకోవాలి. దీనివల్ల కడుపునొప్పి సమస్య తగ్గుతుంది. అలాగే తలనొప్పి సమస్య కూడా తగ్గుతుంది.
2. పుచ్చకాయ, దోసకాయ వంటి నీరు అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి.
3. పచ్చి కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆకు కూరలు, పాలకూర వంటివి తీసుకోవాలి.
4. అల్లం టీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
5. చికెన్, చేపలు, ఒమెగా 3 ఉండే పదార్థాలు తినాలి.
6. పసుపు, డార్క్ చాక్లెట్, వాల్‌నట్స్, అవిసె గింజలు.
7. క్వినోవా, కాయధాన్యాలు, బీన్స్ తినొచ్చు.
8. పెరుగు చాలా మంచి ప్రయోజనకారిగా పని చేస్తుంది. టోఫు కూడా తినొచ్చు.

ఇవి తినకూడదు..

1. ఉప్పు అధికంగా తీసుకోవద్దు.
2. ప్రాసెస్ చేసిన ఫుడ్ అస్సలు తీసుకోవద్దు.
3. అధిక చెక్కర వినియోగం వద్దు.
4. కాఫీకి దూరంగా ఉండాలి.
5. ఆల్కాహాల్, స్పైసీ ఫుడ్స్ తీసుకోవద్దు.
6. ఎర్ర మామిడి కూడా తీసుకోవద్దు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..