Immunity Booster: శీతాకాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఈ ‘టీ’ తాగండి.. మరింత బలంగా మారండి..!

|

Dec 10, 2021 | 2:24 PM

Immunity Booster: శీతాకాలంలో అనేక వ్యాధులు సంక్రమిస్తుంటాయి. వ్యాధుల బారిన పడితే త్వరగా కోలుకోవడం కూడా కష్టమే. అందుకే.. శీతాకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా

Immunity Booster: శీతాకాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఈ ‘టీ’ తాగండి.. మరింత బలంగా మారండి..!
Herbal Tea
Follow us on

Immunity Booster: శీతాకాలంలో అనేక వ్యాధులు సంక్రమిస్తుంటాయి. వ్యాధుల బారిన పడితే త్వరగా కోలుకోవడం కూడా కష్టమే. అందుకే.. శీతాకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆ క్రమంలో బలవర్ధకమైన ఆహారాన్ని తినాలి. అలా అయితేనే ఆరోగ్యంగా, ధృడంగా ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గురు, బాడీ పెయిన్స్ రావడం సర్వసాధారణం. మరి ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ఆరోగ్య నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. అది కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చిన చెబుతున్నారు. అదే హెర్బల్ టీ. హెర్బల్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి హెర్బల్ టీ ని ఎలా చేస్తారు? ఎన్ని రకాల హెర్బల్ టీ లు ఉంటాయి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1. పసుపు టీ
పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టేస్ట్ పరంగా పసుపు కాస్త చేదుగా అనిపించినా.. మరిగించిన నీటిలో అర టీస్పూన్ పసుపు వేసి ఆ తరువాత తాగవచ్చు. పసుపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఫ్లూ, జలుబుకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. నిమ్మరసం, తేనె కలిపి కూడా పసుపు టీ ని తయారు చేసుకోవచ్చు.

2. అల్లం టీ
అల్లం అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడే యాంటీమైక్రోబయల్ గుణాలను కూడా కలిగి ఉంది. కెఫిన్, హెర్బల్ టీ రెండింటిలోనూ దీనిని వినియోగించవచ్చు.

3. లికోరైస్ రూట్ టీ
లైకోరైస్ రూట్ టి. ఇది మిమ్మల్ని అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. మీరు రోజుకు ఒకటి, రెండు కప్పుల లైకోరైస్ రూట్ టీకి తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

4. పుదీనా టీ
పుదీనా టి. ఇది మరొక ప్రసిద్ధ హెర్బల్ టీ. కేవలం పుదీనాతో గానీ, తేనీరు, కాఫీలో మిశ్రమంగానూ తీసుకోవచ్చు. పుదీనా యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

5. లెమన్ గ్రాస్ టీ..
లెమన్‌గ్రాస్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. లెమన్‌గ్రాస్‌లో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కడుపులో, గొంతులో మంట మొదలైన వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

6. మందార టీ
హైబిస్కస్ టీలో యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వ్యాధులను దూరం చేయడంలో సహాయపడతాయి. దీనిలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

7. బ్లాక్ టీ
ప్రజలు తరచుగా బ్లాక్ టీని తీసుకుంటారు. ఇది యాంటీవైరల్ లక్షణాలతో కూడిన కాటెచిన్‌లను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. కామెల్లియా సినెన్సిస్ మొక్క నుండి తయారైన ఇతర రకాల టీల మాదిరిగానే, బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి.

Also read:

History of Thanks: అందరికీ థ్యాంక్స్ చెబుతారు.. మరి ఆ థ్యాంక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?

Snake in Scooty: స్కూటీలో పాముపిల్ల.. భయంతో హడలిపోయిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Beti Bachao Beti Padhao Scheme: మరీ ఇంత ఘోరమా.. ఆ పథకం నిధులన్నీ ప్రకటనలకే సమర్పయామీ..!