Cold Water Side Effects: రెగ్యులర్ గా చల్లని నీరు తాగుతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది..

|

Aug 01, 2022 | 6:09 AM

Cold Water Side Effects: కొంతమందికి కాలాలతో పని లేదు. ప్రతీ సీజన్‌లోనూ కూల్ వాటర్ తాగుతుంటారు. ఫ్రిజ్ వాటర్‌కు అలవాటు పడి నిత్యం..

Cold Water Side Effects: రెగ్యులర్ గా చల్లని నీరు తాగుతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది..
Cold Water
Follow us on

Cold Water Side Effects: కొంతమందికి కాలాలతో పని లేదు. ప్రతీ సీజన్‌లోనూ కూల్ వాటర్ తాగుతుంటారు. ఫ్రిజ్ వాటర్‌కు అలవాటు పడి నిత్యం అవే తాగుతుంటారు. వేసవిలో ఒక గుటక చల్లని నీరు గొంతును చల్లబరుస్తుంది. అయితే, అదే చల్లని నీరు గొంతు నొప్పికి కూడా కారణం అవుతుంది. అదొక్కటే కాదండోయ్.. ఇతర హానీకరమైన అనేక ప్రభావాలు ఈ చల్లటి నీరు తాగడం వల్ల కలుగుతుంది. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

నిత్యం కూల్ వాటర్ తాగడం వల్ల కలిగే సమస్యలు..

1. చల్లటి నీటిని తాగడం వల్ల మైగ్రేన్ లక్షణాలతో పాటు అనేక సమస్యలు తలెత్తుతాయి.

2. జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలకు కారణమవుతుంది.

3. చల్లని నీరు తాగడం వల్ల దాహం పెరుగుతుంది. అందుకే ఎక్కువ నీరు తాగుతాం. మూత్రవిసర్జన ఫ్రీక్వెన్సీని పెరిగి.. శరీరంలోని ఉప్పు శాతం తగ్గుతుంది.

4. చల్లని నీరు తాగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

5. చల్లని నీరు హృదయనాళ ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. భోజనం చేసిన తర్వాత చల్లని నీరు తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

6. చల్లని నీరు శరీరానికి అవసరమైన పోషకాల స్థాయిని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు గురవుతారు.

7. క్రమం తప్పకుండా చల్లటి నీటిని తాగడం వల్ల థైరాయిడ్ లేదా టాన్సిల్ గ్రంథుల సమస్యలు తలెత్తుతాయి.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..