నైరుతి రుతు పవనాలు మెల్ల మెల్లగా అడుగులు ముందుకేస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో వర్షాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తొలకరి జల్లుల్లో తడవాలని పల్లలు మొదలు పెద్ద వారు సైతం ఆశపడుతుంటారు. అయితే, మొదటి వర్షంలో తడవాలనుకునే వారు కాస్త ఆగాలని స్టాప్ బోర్డ్ చూపిస్తున్నారు ఆరోగ్య నిపుణులు తొలకరి జల్లుల్లో తడవటం వల్ల ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, చర్మ సంబంధిత రుగ్మతలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలన్నీ వెంటాడుతాయట. తొలకరి జల్లుల్లో తడిసే వారికి నిపుణులు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తొలి వర్షంలో తడిస్తే జలుబు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో జుట్టు కూడా దెబ్బతింటుంది. మొదటి వర్షం కురిసినప్పుడు నీటితో పాటు.. వాతావరణంలో ఉన్న దుమ్ము, దూళి, ఇతర రసాయన సమ్మేళనాలు కూడా పడతాయి. అవి మన శరీరంపై, తలపై పడటం వలన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా జుట్టుపై పడటం వలన.. తలలో దురద, ఇన్‌ఫెక్షన్ సమస్యలు వస్తాయి.
మొదటి వాన నీటిలో ఎక్కువగా యాసిడ్, రసాయనాలు ఉంటాయి. ఇది చర్మంపై దుష్ప్రభావం చూపుతుంది. అందుకే మొదటి వర్షంలో తడిసిన చాలామందికి చర్మంపై దద్దుర్లు, రాషెస్ వస్తాయి. మొటిమలు కూడా వస్తాయి. పైగా రోగనిరోధక శక్తి కూడా తగ్గే ప్రమాదం ఉంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..