AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: పీరియడ్స్ సమయంలో నొప్పి వస్తుందా..? అయితే.. ఈ ‘టీ’తో ఉపశమనం పొందండి..

హోం రెమిడిస్‌తో పీరియడ్స్ నొప్పికి చెక్ పెట్టవచ్చంటున్నారు. అయితే.. వాము (carom seeds) లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ మొదలైన పోషకాలు ఉంటాయి.

Women Health: పీరియడ్స్ సమయంలో నొప్పి వస్తుందా..? అయితే.. ఈ ‘టీ’తో ఉపశమనం పొందండి..
Ajwain Tea
Shaik Madar Saheb
|

Updated on: Jun 03, 2022 | 6:12 PM

Share

Home Remedies to Periods Pain: పీరియడ్స్ సమయంలో మహిళలు తరచుగా భరించలేని నొప్పిని ఎదుర్కొంటుంటారు. అటువంటి పరిస్థితిలో.. వాము చాలా ప్రయోజనం చేకూరుస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. పీరియడ్స్ సమయమంలో మహిళలు.. మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు పలు హోం రెమిడిస్‌తో పీరియడ్స్ నొప్పికి చెక్ పెట్టవచ్చంటున్నారు. అయితే.. వాము (carom seeds) లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ మొదలైన పోషకాలు ఉంటాయి. అదే సమయంలో ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి పీరియడ్స్ సమయంలో తలెత్తే నొప్పిని తగ్గిస్తాయి. అయితే.. వామును ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇప్పుడు వాము టీని ఎలా తయారు చేయాలి.. పీరియడ్స్ సమయంలో వాము టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పీరియడ్స్ సమయంలో వాము టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

బ్లాక్ టీలో, వాములో యాంటీఆక్సిడెంట్‌లో గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పీరియడ్స్ సమయంలో అలసట, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది కాకుండా వాము టీలో బెల్లం కూడా కలుపుకోవచ్చు. ఇది పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. వాము టీలో నెయ్యి కూడా మిక్స్ చేసుకోవచ్చు. పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు నుంచి కూడా దీనిని తాగవచ్చని పేర్కొంటున్నారు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ముందుగా వైద్యులను సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

వాము టీ ఎలా తయారు చేయాలో చూడండి..

ముందుగా ఒక గ్లాసు నీటిలో టీ స్పూన్ వాము గింజలను వేసి మరిగించండి.

నీరు పసుపు రంగులోకి మారిన తర్వాత అర టీస్పూన్ బ్లాక్ టీ వేసి నీటిని మరిగించాలి.

ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసి అందులో నెయ్యి వేసి ఆ మిశ్రమాన్ని కూడా మరిగించాలి.

ఆ తర్వాత ఆస్వాదిస్తూ తాగండి..

గమనిక – పీరియడ్స్ సమయంలో వాము టీ తాగడం వల్ల మీకు ఏదైనా సమస్య లేదా సమస్యలు వస్తే.. తీసుకోవడం మానేయండి.. ఇది కాకుండా వేసవిలో పరిమిత పరిమాణంలో మాత్రమే వాము తినాలి. వీటిని అనుసరించే మందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..