Health Tips: సాధారణంగానే కూరగాయలు తింటే శరీరానికి పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే, వాటిలో కొన్ని రకాల కూరగాల ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఒక్కో కూరగాయలో ఒక్కో రకమైన పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. అలాంటి వాటిలో దొండకాయ కూడా ఒకటి. మన దేశంలో దొండకాయలను విరివిగా పండిస్తారు రైతుల. గ్రామీణ ప్రాంతాల్లో అయితే, ప్రజల ఇంటి పెరట్లో దొండ తీగలను పెంచుకుంటారు. వాటి కూర వండుకుని తింటారు. తమకు ఇష్టమైన రీతిలో కూర, ఫ్రై చేసుకుని లాగించేస్తుంటారు. ఇంకొందరైతే పచ్చి దొండకాయలనే కుమ్మేస్తుంటారు. సాధారణంగా చిన్నపిల్లలు దొండకాయలను పచ్చిగానే తింటుండడం ఎన్నోసార్లు చూసే ఉంటారు. అయితే, దొండకాయలో అనేక పోషకాలు ఉన్నాయని, వాటిని తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దొండకాయలే కాదండోయ్.. దొండ ఆకులు కూడా ఆరోగ్యకారకం అట. మరి దొండ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. దొండకాయలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
2. బీటా కెరోటిన్, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్ సి సహా క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉన్నాయి.
3. దొండకాయ తినడం వల్ల శరీరంలో రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
5. జీర్ణాశయ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
6. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తాయి.
7. ఆస్తమాను నివారించడంలో, క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో కూడా దొండకాయలు సహాయపడుతుంది.
8. బెండకాయంలో ఉండే బేటా కెరోటిన్ విటమిన్- ఏగా రూపాంతరం చెంది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
Also read:
Shikhar Dhawan: శిఖర్ ధావన్ చెప్ప చెల్లుమనిపించిన తండ్రి.. వైరల్ అయిన వీడియో..
Cyber Crime: ఒక్క మెయిల్‌తో రూ.46 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.. అసలేం జరిగిందంటే..